తెలుగు ప్రజలకు సినిమాకు మించిన వినోద సాధనం లేదు అంటుంటారు. అయితే కరోనా రాక తర్వాత ఓటీటీలు, టీవీలు సినిమాను ఓ ఆప్షన్‌గా మార్చేశాయి. అంతకుముందు సినిమానే వినోద సాధనంగా ఉన్నప్పుడు… ప్రేక్షకులకు ఉన్నవి రెండు సమస్యలు. ఒకటి మంచి సినిమా రావడం, రెండోది పెద్ద సినిమా వస్తే టికెట్ల రేట్లు బాదడం. ఎప్పుడో రెండేళ్ల క్రితం ఇలాంటి బాధలు చూసేవాళ్లం. తొలి సమస్య ఎవరి చేతుల్లోనూ లేదు. కానీ రెండో సమస్య సినిమా వాళ్ల చేతుల్లో పక్కాగా ఉంది. వాళ్లు తలచుకుంటే ప్రేక్షకులకు ఈ బాధ లేకుండా చేయొచ్చు.
ఇదంతా చెప్పింది తెలుగు ప్రజల గురించే కానీ… ముఖ్యంగా ఏపీ ప్రజల గురించి. మొన్నటి వరకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘టికెట్ ధరల’ జీవో కారణంగా తక్కువ రేటుకే సినిమా చూడటం అలవాటు చేసుకున్నారు. అయితే దాని వల్ల థియేటర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు… మొత్తంగా నిర్మాతకు లాస్ వచ్చేది. అయితే ఇప్పుడు హైకోర్టు తీర్పు కారణంగా… మళ్లీ టికెట్ ధరలు నిర్ణయించుకునే ఆప్షన్ థియేటర్లకు వచ్చేసింది. ఇది ఇండస్ట్రీకి మంచి చేసే విషయమే కానీ. సరైన రీతిలో వాడుకోకపోతే ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తుంది.
మొన్నీమధ్య ఓ సీనియర్ దర్శకుడు మంచి సినిమా వస్తే… టికెట్ రేటు ₹300 పెట్టినా… ₹500 పెట్టినా కొంటారు అని అన్నారు గుర్తుందా? ఇప్పుడు అదే గుర్తొస్తోంది. స్టార్‌హీరో సినిమా వస్తోంది కదా అని టికెట్ రేటు ₹500 పెడితే… ప్రేక్షకుడి జేబు ఖాళీ అవుతుంది. ఓ కుటుంబం వీకెండ్‌లో సినిమాకు వెళ్తే ₹2000 అవుతుంది. ఇది సగటు ప్రేక్షకుడికి నష్టం చేసేదే. కాబట్టి అవకాశం వచ్చింది కదా… టికెట్ల రేట్లు ఆకాశానికి పెంచేస్తే… సినిమా ప్రేక్షకుడు అన్యాయం అయిపోతాడు.
Most Recommended Video
మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్ టాలీవుడ్ హీరోలకు కలిసొచ్చిందా!