సినిమా రంగంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ అవడం అనేది ఆషామాషీ విషయం కాదు. ఎంతో కృషి, పట్టుదల, ఓర్పు, టాలెంట్‌తో పాటు కాస్త కాలం కలిసి రావాలి. అందుకే ‘తాటికాయంత టాలెంట్ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’ అంటుంటారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ వంటి సూపర్ స్టార్స్ స్వయంకృషితో పైకొచ్చి.. తర్వాత ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ యాక్టర్ సుహాస్ పాగోలుని చూస్తుంటే ఇప్పుడు వారిలానే సోలోగా స్టార్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది.
విజయవాడకు చెందిన సుహాస్.. యూట్యూబ్ ఛానల్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేశాడు. నాగ చైతన్య ‘దోచెయ్’, ‘మజిలీ’, ‘పడి పడి లేచే మనసు’; ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘డియర్ కామ్రేడ్’, ‘ప్రతిరోజు పండగే’ వంటి పలు చిత్రాల్లో చిన్న చిన్న రోల్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఇక హీరోగా ‘కలర్ ఫోటో’ తో సత్తా చాటాడు. నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. తన వాయిస్ కూడా బాగా ప్లస్ అయింది. సైడ్ క్యారెక్టర్ల నుండి స్టార్‌గా ఎదగడానికి మంచి పునాదిగా నిలిచే సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు.
ఇటీవల అడివి శేష్ ‘హిట్ 2’ లో నెగిటివ్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. తను నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ ఫిబ్రవరి 3న విడుదలైంది. ప్రోమోస్ ప్రామిసింగ్‌గా అనిపించడంతో పాటు మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ఆడియన్స్ నుండి రెస్పాన్స్ బాగుంది. ‘‘సుహాస్ మీడియం హీరోగా మార్కెట్ సెట్ చేసుకుంటాడు..
తన సహజమైన నటన ఆకట్టుకుంటుంది.. కామెడీ, ఎమోషన్ ఏదైనా చాలా బాగా చేస్తున్నాడు.. త్వరలో ‘మాస్ మహారాజా’ రవితేజలా స్టార్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం హీరోగా ‘ఆనందరావ్ అడ్వెంచర్స్’ అనే మూవీ చేస్తున్నాడు సుహాస్.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?