ఈ మధ్యనే ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ లభించిన సంగతి తెలిసిందే. ఇది టాలీవుడ్ కు, ఆర్.ఆర్ ఆర్ అభిమానులకు గర్వకారణం అనే చెప్పాలి. మరోపక్క ఆస్కార్ రేసులో కూడా ఆర్.ఆర్.ఆర్ కు అవార్డులు రావాలని అంతా కోరుకుంటున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు కి, ఎన్టీఆర్ కు అవార్డులు లభించే అవకాశాలు ఉన్నాయని ప్రఖ్యాత… వెరైటీ పత్రిక ప్రచురించింది. ఇదిలా ఉండగా..ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కు లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు కూడా లభించడం..
అనేది ఆనందాన్ని రెట్టింపు చేసే విషయంగా చెప్పుకోవాలి. ఇలా వరల్డ్ వైడ్ గా ఆర్.ఆర్.ఆర్ కు దక్కుతున్న గౌరవం బట్టి తెలుగు ప్రేక్షకులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఆ జోష్ ను మరింత రెట్టింపు చేయడానికి రాజమౌళి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇందులో అవతార్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ తో రాజమౌళి దిగిన ఓ ఫోటో ఉంది.ఈ సందర్బంగా రాజమౌళి…’ ఆర్.ఆర్.ఆర్ ‘ సినిమాని రెండు సార్లు చూసినట్టు జేమ్స్ కేమరూన్..
రాజమౌళి తో అన్నాడట. అంతేకాదు ఈ సినిమా తనకు బాగా నచ్చిందని.. తన భార్య సుజిక్ జేమ్స్ కు కూడా ఆర్.ఆర్.ఆర్ సినిమా చూడమని రికమెండ్ చేశానని ఈ సందర్భంగా జేమ్స్ కేమరూన్ చెప్పాడట. ఇదంతా రాజమౌళి పోస్ట్ లో పేర్కొన్నాడు. అవతార్ సృష్టికర్తకు ఆర్.ఆర్ ఆర్ నచ్చడంతో రాజమౌళి మురిసిపోయాడు. ప్రస్తుతం రాజమౌళి పోస్ట్ వైరల్ గా మారింది.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?