Avatar: Fire and Ash: ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’… టాక్ ఇంత తేడా కొట్టిందేంటి?

ప్రపంచ సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar: Fire and Ash) ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. అయితే, రిలీజ్‌కు ముందే బయటికి వచ్చిన ఇనిషియల్ రివ్యూలు మాత్రం ఆడియన్స్‌కి షాక్ ఇస్తున్నాయి.ప్రముఖ రివ్యూ అగ్రిగేటర్ ‘రాటెన్ టొమాటోస్’లో ఈ చిత్రానికి కేవలం 70% స్కోర్ మాత్రమే వచ్చింది.

Avatar: Fire and Ash

అవతార్ సిరీస్‌లో వచ్చిన గత రెండు సినిమాలతో పోలిస్తే ఇదే అత్యల్ప రేటింగ్ కావడం గమనార్హం. మొదటి పార్ట్ ఒక క్లాసిక్‌గా నిలిచిపోతే, రెండో పార్ట్ ‘ది వే ఆఫ్ వాటర్’ విషయంలోనూ మొదట ఇలాంటి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, బాక్సాఫీస్ దగ్గర మాత్రం అది 2 బిలియన్ డాలర్లు కొల్లగొట్టి అందరి అంచనాలు తలకిందులు చేసింది. ఇప్పుడు ఈ నెగిటివ్ టాక్‌ని దాటి కామెరాన్ మళ్లీ మ్యాజిక్ చేస్తారా? లేదా? అన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

ఇక ఈ సినిమా రన్‌టైమ్ ఏకంగా 3 గంటల 17 నిమిషాలు (197 నిమిషాలు). ఈ ఫ్రాంచైజీలోనే ఇది అత్యంత నిడివి గల సినిమా. దీని కోసం మేకర్స్ దాదాపు 400 మిలియన్ డాలర్ల (భారీ) బడ్జెట్‌ను కుమ్మరించారు. అవతార్ 2తో పాటే న్యూజిలాండ్‌లో దీని షూటింగ్ కూడా జరిపారు. గత సినిమాల్లో హీరో జేక్ సల్లీ కథ చెప్తే.. ఈసారి అతని కొడుకు ‘లోక్’ (Lo’ak) నేరేషన్‌తో కథ నడుస్తుంది.కథలో కొత్తగా ‘మాంగ్‌క్వాన్’ (Mangkwan) అనే అగ్ని సంబంధిత తెగ ఎంట్రీ ఇస్తోంది.

గాలిలో ప్రయాణించే నౌకలతో తిరిగే మరో కొత్త సంచార జాతి కూడా ఇందులో పరిచయం కానుంది. నెటెయమ్ మరణం తర్వాత సల్లీ కుటుంబం పడుతున్న ఆవేదన, కొత్తగా వచ్చిన ముప్పు చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

దర్శకుడు కేకే (కిరణ్ కుమార్) మృతి పై వస్తున్న వార్తల్లో నిజమెంత..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus