‘అవతార్’ సినిమా విడుదలైన దాదాపు 13 ఏళ్లు దాటేసింది. అప్పటి లెక్కల ప్రకారం.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు సృష్టించింది. తరువాత కూడా చాలా ఏళ్లపాటు ఆ రికార్డులు కొనసాగాయి. టికెట్ రేట్లు పెరిగిపోవడం, వైడ్ రిలీజెస్ వలన ఆ తరువాత వేరే సినిమాలు దాన్ని దాటగలిగాయి కానీ అప్పటి లెక్కలో చూస్తే ‘అవతార్’ ఇప్పటికీ నంబర్ వన్ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాకి ఇప్పుడు మూడు సీక్వెల్స్ వస్తున్నాయి.
అందులో మొదటి సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఫస్ట్ పార్ట్ విడుదలై 13 ఏళ్లు అయిపోతుంది. ఇప్పుడు సీక్వెల్ చూడాలంటే ముందు పార్ట్ రివిజన్ అవసరం. అదే థియేటర్లో మళ్లీ ‘అవతార్’ను చూపిస్తే రీచ్ మరోలా ఉంటుంది. అందుకే సెప్టెంబర్ 23 నుంచి ఇండియా వైడ్ రెండు వారాల పాటు ‘అవతార్’ సినిమాను థియేటర్లలో ప్రదర్శించనున్నారు. రీరిలీజ్ అంటే నామమాత్రంగా కాకుండా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.
అన్ని మెయిన్ మల్టీప్లెక్స్ లలో పెద్ద ఎత్తున షోలు కేటాయించబోతున్నారు. ‘అవతార్’ ఓల్డ్ ప్రింట్ ను రీమాస్టర్ చేసి 4కే రిజల్యూషన్ లో.. బెటర్ సౌండ్ క్వాలిటీతో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. త్రీడీలో కూడా రిలీజ్ ఉంటుందని తెలుస్తోంది. ‘అవతార్2’ సినిమా చూడడానికి ముందు ఈ సినిమాను రీరిలీజ్ చేస్తే కచ్చితంగా హైప్ ఉంటుంది. సీక్వెల్ చూడాలనే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. అందుకే దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఇలా ప్లాన్ చేశారు.
ఆయన తన కెరీర్ లో ఒక్కో సినిమాకి ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుంటారు. ‘టైటానిక్’ సినిమా తరువాత 11 ఏళ్లు గ్యాప్ తీసుకొని ‘అవతార్’ చేశారు. ఆ తరువాత ‘అవతార్ 2’ కోసం 13 ఏళ్ల సమయం కేటాయించారు. మరి ఈసారి ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతారో చూడాలి!
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?