Avatar2: అవతార్2 విషయంలో అలా జరుగుతోందా?

జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కి భారీ అంచనాలతో విడుదలైన అవతార్2 మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అయితే ఈ సినిమా కలెక్షన్లు మాత్రం ఆశాజనకంగా లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ లో అవతార్2 సినిమా 110 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుందని సమాచారం అందుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 435 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రావడం గమనార్హం.

ఈ వారం పలు భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నా మల్టీప్లెక్స్ లలో మరికొన్ని వారాల పాటు అవతార్2 సినిమా హవా కొనసాగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 37 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. సింగిల్ స్క్రీన్లలో మాత్రం అవతార్2 డిజాస్టర్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అవతార్2 రిజల్ట్ తెలిసి నెటిజన్లు సైతం ఒకింత షాకవుతున్నారు.

ఓటీటీల హవా పెరగడం కూడా అవతార్2 రిజల్ట్ పై ప్రభావం చూపించిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అవతార్2 మూవీ ఫలితం ఆ మూవీ అభిమానులను ఒకింత హర్ట్ చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అవతార్2ను ఫస్ట్ వీకెండ్ లో చూడని వాళ్లు వీక్ డేస్ లో ఈ సినిమాను థియేటర్లలో చూస్తున్నారు. కొత్త తరహా కథాంశాలతో విజువల్ వండర్స్ గా సినిమాలను తెరకెక్కిస్తే సినిమాలు కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే సినిమాలు అద్భుతంగా ఉంటే మాత్రమే మరీ భారీ బడ్జెట్లు వర్కౌట్ అవుతాయని చెప్పవచ్చు. అవతార్2 మూవీ గురించి టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అవతార్2 సినిమా సంక్రాంతి వరకు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ప్రదర్శితం కానుందని సమాచారం.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus