అవికా గోర్ పెళ్లి ఫోటో వైరల్!

  • March 29, 2021 / 12:45 PM IST

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అవికా గోర్.. ఆ తరువాత ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో హీరోయిన్ గా మారింది. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది. దీంతో టాలీవుడ్ లో ఈ బ్యూటీకి అవకాశాలు పెరిగాయి. ‘సినిమా చూపిస్త మావ’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ వంటి చిత్రాల్లో నటించింది. ఇదిలా ఉండగా.. గతేడాది అవికా.. మిలింద్ చంద్వానీ అనే వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదని చెప్పింది.

రీసెంట్ గా మిలింద్ పుట్టినరోజు నాడు సోషల్ మీడియాలో అతడి ఫోటోలు షేర్ చేస్తూ లెటర్ కూడా రాసింది. కానీ సడెన్ గా మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన వారంతా కూడా షాకవుతున్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకున్నావంటూ ఆమెని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ తరువాతే ఫోటోల వెనుకున్న స్టోరీ బయటపడింది. అవికా గోర్, ఆదిల్ ఖాన్ ఇద్దరూ కలిసి ‘కాదిల్’ అనే పాటలో నటించారు.

ఈ పాటలో భాగంగా చర్చిలో పెళ్లి జరిగినట్లు వెడ్డింగ్ షూట్ చేశారట. త్వరలోనే ఈ పాట విడుదల కానుంది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను అవికా తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ.. ఫైనల్లీ అంటూ హార్ట్ సింబల్ జోడించింది. దీంతో అందరూ అవికాకు నిజంగానే పెళ్లి జరిగిపోయిందనుకున్నారు. కానీ ఇది వారిద్దరూ కలిసి నటించిన సాంగ్ ని ప్రమోట్ చేయడానికి అని తెలుసుకున్న నెటిజన్లు.. అవికా తమని ఆటపట్టించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

1
2

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus