తెలుగు హీరో దెబ్బకు నటనకు దూరంకానున్న అవికా గోర్
- December 21, 2016 / 07:20 AM ISTByFilmy Focus
చిన్నారి పెళ్లి కూతురిగా చిన్నప్పుడే తెలుగు ప్రజల మనసు దోచుకున్న అవికా గోర్ ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకుంది. తర్వాత అదే హీరో తో సినిమా చూపిస్తా మామ చిత్రంలో మళ్ళీ జత కట్టి విజయం అందుకుంది. తాజాగా “ఎక్కడికి పోతావు చిన్నవాడా” లో కీలకరోల్ పోషించి మంచి పేరు తెచ్చుకుంది. ఇలా వరసగా విజయాలను అందుకుంటున్న ఈ భామ సినిమాలకు స్వస్తి చెప్పేందుకు సిద్ధమైంది. కెరీర్ బాగానే ఉంది కదా.. మరి ఎందుకు అలంటి నిర్ణయం తీసుకుంటోందని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తెలుగు యంగ్ హీరో ఒకరు తనని చులకన భావనతో విమర్శించారని అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పనుందట.
ఎవరో ఏదో అంటే మనకిష్టమైన రంగాన్ని వదిలేస్తామా.. ఆ మాటాలన్న మనిషిని వదిలేస్తాం. ఇక్కడ అవికా సీరియస్ కావడానికి కారణం.. ఆహీరో తో చాలా అనుబంధం ఉందంట. ఇద్దరి మధ్య కొంతకాలం డీప్ స్నేహం కొనసాగింది. అటువంటి వ్యక్తి ఆలా మాట్లాడేసరికి సహించలేక పోయిందంట. అందుకే సొంత ఊరికి వెళ్లి ఏదైనా జాబ్ చేసుకుని బ్రతికేస్తానని మిత్రులతో చెప్పుకున్నట్లు సమాచారం. బాధతో కూడిన ఆవేశంతో తీసుకున్న నిర్ణయంలో మార్పు ఉంటుందని, మళ్ళీ నటిస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఒక వేళ నటించినా ఆమె తెలుగులో సినిమాలు చేయకపోవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.











