యంగ్ కపుల్ ప్యూర్ లవ్ తెలిపేలా ‘ఏయ్ పిల్లా…’ సాంగ్

నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’. మొదటిసారి చైతు సాయి పల్లవి జంటగా నటిస్తుండగా సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత శేఖర్ కమ్ముల చేస్తున్న చిత్రం ఇది. ఈమూవీలో చైతూ లుక్ కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తుండగా, సాయి పల్లవి తో ఆయన కెమిస్ట్రీ సినిమాకు హైలెట్ గా నిలిస్తుంది అనిపిస్తుంది.

కాగా నేడు ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘ఏయ్.. పిల్లా’ సాంగ్ విడుదల కావడం జరిగింది. మధ్య తరగతి అమ్మాయి అబ్బాయి మధ్య నడిచే ప్యూర్ లవ్ గా ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. తనకు దొరికిన ఓ అమ్మాయి ప్రేమ అందించిన అనుభూతిని తెలిపేలా సాగిన ఈ పాటకు తగ్గట్టుగా చైతన్య పింగళి సాహిత్యం అందించగా, హరిచరణ్ ఆహ్లాదంగా పాడారు. లవ్ స్టోరీ మూవీకి సంగీతం ప్రవీణ్ సి హెచ్ అందిస్తున్నారు. నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్ మోహన్ రావ్ లవ్ స్టోరీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య ఈ మూవీలో మిడిల్ క్లాస్ డ్రెప్రెస్సివ్ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. లవ్ స్టోరీ మూవీ ఏప్రిల్ 2న విడుదల కానుంది.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus