Ayudha Pooja Song Postponed: ఆయుధ పూజ సాంగ్ విషయంలో వెనుకడుగు వెనుక కారణాలివేనా?

దేవర (Devara) సినిమా నుంచి ఈరోజు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఆయుధ పూజ సాంగ్ విడుదల కావాల్సి ఉన్నా ఈ సాంగ్ రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. కనీసం సాంగ్ ప్రోమో రిలీజ్ చేసినా బాగుండేదని ఫ్యాన్స్ భావించగా ఆ దిశగా కూడా అడుగులు పడలేదు. సినిమా రిలీజ్ సమయానికి అయినా ఆయుధ పూజ సాంగ్ విడుదలవుతుందా? లేదా? అనే ప్రశ్నకు సరైన జవాబు దొరకడం లేదు.

Ayudha Pooja

(Ayudha Pooja) ఈ సాంగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని డైరెక్ట్ గా సినిమాలో సాంగ్ చూడాల్సి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అందుకే సాంగ్ రిలీజ్ వాయిదా వేశారని వినిపిస్తోంది. దేవర మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించిన క్లారిటీ వస్తుందేమో చూడాల్సి ఉంది. ఆయుధ పూజ సాంగ్ సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉండనుందని సమాచారం అందుతోంది. ఈ సాంగ్ గురించి త్వరలో పూర్తి అప్ డేట్స్ వస్తాయేమో చూడాలి.

మరోవైపు దేవర సినిమాలో ట్విస్ట్ ఇదేనంటూ వేర్వేరు కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. దేవర సినిమాలో తండ్రి పాత్ర కొడుకు పాత్ర చేతిలో చనిపోతుందని ప్రచారం జరుగుతుండగా మరోవైపు ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపిస్తాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)  సైతం దేవర మూవీలో ఊహించని సర్ప్రైజ్ ఉంటుందని పలు సందర్భాల్లో వెల్లడించడం జరిగింది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది. ఈ సినిమా విషయంలో తాను టెన్షన్ పడుతున్నానని తారక్ సైతం పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దేవర1 ఫీవర్ మాత్రం ప్రేక్షకుల్లో మామూలుగా లేదు. బుక్ మై షో యాప్ లో 4 లక్షలకు పైగా యూజర్లు ఈ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు.

నానితో శ్రీకాంత్ ఓదెల రెండో సినిమా అనౌన్స్మెంట్ కి సర్వం సిద్దం.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus