Nani, Srikanth Odela: నానితో శ్రీకాంత్ ఓదెల రెండో సినిమా అనౌన్స్మెంట్ కి సర్వం సిద్దం.!

ఇండస్ట్రీలో సెంటిమెంట్లు చాలా సీరియస్ గా ఫాలో అవుతుంటారు. అది కాంబినేషన్ విషయంలో కావచ్చు, లేదా పూజా కార్యక్రమాల విషయంలో కావచ్చు. ఒక్కసారి అది వర్కవుట్ అయ్యిందంటే.. అదే తరహాను ఫాలో అవ్వడానికి అస్సలు ఆలోచించరు. ఈ జాబితాలో ఇప్పుడు నాని (Nani)  కూడా చేరాడు. “దసరా”  (Dasara) సినిమా వరకు తన సినిమాలకు రెగ్యులర్ యానిమేటెడ్ టీజర్లు రిలీజ్ చేసే ఫార్మాట్ ను ఫాలో అయిన నాని.. “హాయ్ నాన్న” (Hi Nanna) నుండి ఎనౌన్స్ మెంట్ కోసం స్పెషల్ వీడియోలు చేయడం మొదలెట్టాడు.

Nani, Srikanth Odela

మొదట “హాయ్ నాన్న” తర్వాత “సరిపోదా శనివారం” (Saripodhaa Sanivaaram)  , మొన్న “హిట్ 3” ఇలా తన ప్రతి సినిమా కోసం ఒక స్పెషల్ వీడియో షూట్ చేసి సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయడాన్ని ఆనవాయితీగా మార్చుకున్న నాని.. ఇప్పుడు తనతో “దసరా” తీసి ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)  దర్శకత్వంలో నటించనున్న రెండో చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కోసం కూడా ఓ స్పెషల్ వీడియో షూట్ చేసాడని తెలుస్తోంది.

ఈ విషయాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలియజేశాడు. ఆ స్పెషల్ వీడియో ఎప్పడు రిలీజ్ చేస్తాడు అనే విషయం ప్రస్తుతానికి తెలియదు కానీ.. నాని ఈ ఫార్మాట్ ను సెంటిమెంట్ లా ఫాలో అవుతున్నాడా లేక కొత్త ఒరవిడిని సృష్టించడం కోసమే చేస్తున్నాడా అనేది ఆయనకే తెలియాలి.

ఇకపోతే.. ఈ సినిమా కోసం దాదాపు 100 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని, పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా కోసం క్యాస్టింగ్ ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కోలీవుడ్ టాప్ హీరోయిన్ ను ఈ సినిమా కోసం సంప్రదిస్తున్నారట. మరి ఈ విషయాలన్నీ ఎనౌన్స్ మెంట్ వీడియోతోనే రివీల్ చేస్తారా లేక మెలమెల్లగా రివీల్ చేస్తారా అనేది చూడాలి.

ఆ కారణం వల్లే దేవర టైటిల్ ఫిక్స్ చేశాం.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus