Ram Charan: దర్గా వివాదం.. చరణ్ కి హిందూ సంఘాల హెచ్చరిక!

రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నారు. ఈ టైం ఆయన క‌డ‌ప ద‌ర్గాను సందర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇది ప్రస్తుతం వివాదాస్పదమైంది. చాలా మంది దీనిని తప్పుబడుతున్నారు. హిందూ సంఘాలు అయితే మండిపడుతున్నాయి.క‌డ‌ప ద‌ర్గాలో 80వ జాతీయ ముషైరా గ‌జ‌ల్ వేడుకలకి వెళ్ళినప్పుడు మాలలో ఉన్న చరణ్ బొట్టుని తీసేసిన విషయాన్ని అంతా వేలెత్తి చూపుతున్నారు. ముఖ్యంగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నాడు అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) విలేకరుల సమావేశమయ్యి ఈ విషయం పై చర్చించారు.

Ram Charan

‘అయ్యప్ప మాలధారణలో ఉండి అయ్యప్ప భక్తుల మనోభావాలను రాంచరణ్ దెబ్బ తీశారు.మాల నియమాలకు విరుద్ధంగా బొట్టును తీసేసి.. దర్గాని, సమాధిని సందర్శించడం అనేది ధర్మానికి విరుద్ధం. ఒక వైపు ఆయన బాబాయ్, ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  సనాతన ధర్మం కోసం పోరాడుతుంటే చరణ్ ఇలా చేయడం ఏమాత్రం బాలేదు. మీరు దర్గాకి వెళ్లడంలో తప్పులేదు. కానీ మాలలో ఉండగా దర్గాకి వెళ్లడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి గాను వెంటనే మాల తీసేసి అయ్యప్ప భక్తులకు అలాగే హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి’ అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.

2024కి గాను కడప దర్గాలో జరిగిన 80వ జాతీయ ముషైరా గ‌జ‌ల్ వేడుకలకి హాజరుకావాలని ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) 3 నెలలకి ముందే రాంచరణ్ వద్ద మాట తీసుకున్నారట. ఆయనకు ఇచ్చిన మాట వల్లనే మాలలో ఉన్నప్పటికీ కడప దర్గాని రాంచరణ్ సందర్శించడం జరిగింది. ఈ విషయాన్ని దర్గాకి వెళ్లిన రోజునే చరణ్ చెప్పడం జరిగింది. అయినప్పటికీ దీనిని హిందూ సంఘాలు తప్పుపడుతున్నాయి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

నయనతార థ్యాంక్స్‌ పోస్ట్‌.. ధనుష్‌ని ఇరిటేట్‌ చేయడానికేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus