ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసిన బాహుబలి కంక్లూజన్ శుక్రవారం విడుదలై విశేష ఆదరణ అందుకుంటోంది. తొలిరోజు వందకోట్ల కలక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. రాజమౌళి వెండితెరపై గీసిన అద్భుత కళాఖండాన్ని చూసి సామాన్య ప్రేక్షకులతో పాటు ప్రముఖ సినీస్టార్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. రాజమౌళి సెన్సార్ కి పంపించిన కాపీలో కొన్ని సీన్లు, షాట్లు కోతకి గురి అయినట్లు తెలిసింది. ప్రధానంగా రక్తపాతం ఎక్కువగా కలిగిన సీన్స్ తొలిగించారని, బీభత్సకరంగా కనిపించిన షాట్స్ కి సెన్సార్ సభ్యులు కట్స్ చెప్పినట్లు సమాచారం.
ముఖ్యం గా క్లైమాక్స్ ఫైట్ లో తలలు నరకే సీన్లకు సెన్సార్ కత్తెర పడింది. ఈ సినిమాకి సంబంధించి ‘కట్స్’ సూచిస్తూ హైదరాబాద్ లోని సీబీఎఫ్ సీ రీజనల్ అధికారి పీవీఆర్ రాజశేఖరం జారీ చేసిన కాపీ ఒకటి మీడియాకు దొరికింది. రానా, ప్రభాస్ ల మధ్య జరిగే యుద్ధానికి సంబంధించి కొన్ని దృశ్యాలు, మిగతా అభ్యంతరకర సన్నివేశాలను కట్ చేసినట్లుగా ఈ రిపోర్ట్ లో ఉన్నాయి. ఇవి కూడా ఉన్నట్లయితే సినిమా మూడు గంటలు ఉండేవన్నమాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.