బాహుబలి మ్యానియా ఇంకా అయిపోలేదు…ఏదో ఒక చోట ఏదో ఒక విధంగా ఈ మ్యానియా కొనసాగుతూనే ఉంది. బాహుబలి ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే అదే క్రమంలో ఈ సినిమా వల్ల టాలీవుడ్ స్థాయి మరింత పెరిగింది. అయితే అదే క్రమంలో ఈ సినిమా 50రోజులు పూర్తి చేసుకుని ఇంకా కొన్ని చోట్ల సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉంది. అంతా బాగానే ఉంది కదా అంటే అసలు ట్విష్ట్ అక్కడే ఉంది…ఈ సినిమా ఇప్పుడు కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. విషయంలోకి వెళితే….ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను తిరగవ్రాసిన ‘బాహుబలి 2’ విడుదలై 50 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఈసినిమా యూనిట్ వర్గాలు ఒక 50డేస్ పోస్టర్ ను విడుదల చేశాయి. అయితే విడుదల చేసిన పోస్టర్ పై కొన్ని సెటైర్లు సైతం పడుతున్నాయి. దీనికి అసలు కారణం ఏంటి అంటే ‘బాహుబలి 2’ 1050 సెంటర్లలో 50 రోజులు రన్ పూర్తి చేసుకుంది అన్న విషయాన్ని ఈ పోస్టర్ హైలెట్ చేస్తోంది. అయితే ఈ సెంటర్స్ విషయంలో క్లారిటీ లేదు అని కొందరి విమర్శకుల వాదన. ‘బాహుబలి 2’ 17వందల కోట్లకు పైగా వసూలు చేసింది అన్న వార్తలు ఉన్నా ఇప్పటికీ ఈసినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.
అదేవిధంగా ‘బాహుబలి 2’ 1050 సెంటర్ల లిస్టు ఏమిటి అన్నది క్లారిటీ ఇవ్వకుండా సెంటర్లకు సంబంధించిన వివరాలు చెప్పకుండా కేవలం ఒక ముద్ద అంకెతో ఈ సెంటర్స్ లిస్టుతో ఈ పోస్టర్ ను విడుదల చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇదే మ్యాటర్ అప్పట్లో మగధీర సినిమా విషయంలో కూడా చోటు చేసుకుంది. అప్పట్లో ఇదే విషయంపై నిర్మాత అల్లు ఆరవింద్ తో తనకు కాస్త ఇబ్బందులు తలెత్తాయి అని సైతం దర్శకుడు రాజమౌళి ఒకానొక న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటెర్వ్యులో తెలిపాడు…ఈ కధంతా చూస్తూ ఉంటే బడా సినిమాల విషయంలో చాలా మతలబులు జరుగుతూ ఉన్నాయి అని ఇట్టే అర్ధం అయిపోతుంది. మరి ఈ సినిమా సెంటర్స్ మరియు కలెక్షన్స్ విషయంలో రాజమౌళి ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.