ఎవ్వరూ ఊహించని విధంగా రానా తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసి కొంత చర్చలకు తెరలేపాడు. ‘ఫైనల్ గా ఆమె యెస్ చెప్పింది’ అంటూ సింపుల్ గా ఓ పోస్ట్ పెట్టి ‘టాక్ ఆఫ్ ది టౌన్’ అయ్యాడు. మిహీకా బజాజ్ అనే అమ్మాయితో చాలా కాలం నుండీ ప్రేమలో ఉన్న రానా.. తన రిలేషన్ షిప్ గురించి కొంచెం కూడా అనుమానం రాకుండా … ఎటువంటి వార్తలు మీడియాకు లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడ్డాడు.
ఇండస్ట్రీలో ఉన్న మిగతా హీరోలు.. రానా స్నేహితులు అయిన వారికి కూడా ఈ విషయం తెలీదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రానా పెళ్ళి డిసెంబర్ లో ఉంటుంది అని రానా తండ్రి సురేష్ బాబు కూడా క్లారిటీ ఇచ్చేసాడు. లాక్ డౌన్ టైములో మాకు మంచి పని పెట్టాడు రానా.. ఈ పెళ్ళి పనులు మొదలుపెట్టడమే మా మొదటి కర్తవ్యం అని కూడా సురేష్ బాబు చెప్పారు. ఇక ఇప్పుడు లాక్ డౌన్ పూర్తయ్యి.. పరిస్థితి అంతా నార్మల్ గా వచ్చేస్తే… విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ను చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
లేని పక్షంలో అప్పటికి ఇండియాలో అయినా పరిస్థితి సెట్ అయ్యే పరిస్థితి కొంతవరకూ ఉందని.. ఇక్కడే ఓ రిచ్ గా ఉండే ప్రదేశంలో పెళ్లిని జరపాలి అని ప్లాన్ చేస్తున్నారు. దివంగత రామానాయుడు గారి పెద్ద మనవడు కాబట్టి 70 కోట్ల నుండీ 100 కోట్ల బడ్జెట్ వరకూ పెళ్ళి కోసం అనుకుంటున్నట్టు తెలుస్తుంది.
Most Recommended Video
దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు