‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా స్థాయి పెరిగింది. నిర్మాతల ఆలోచనలు, ఆర్టిస్టుల పరిమితులు అన్నీ మారాయి. వేరే భాషల ప్రేక్షకులు సైతం తెలుగు సినిమాల వైపు చూసేలా చేసింది ‘బాహుబలి’. తెలుగు సినిమా మార్కెట్ ను 10 రెట్లు పెంచింది. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి అంటే.. దానికి కారణం కూడా ‘బాహుబలి’నే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు..! అలాంటి ‘బాహుబలి’ ని రీ రిలీజ్ చేస్తే ఫలితం ఏ రేంజ్లో ఉంటుందో చెప్పకనే చెప్పాడు రాజమౌళి.
కాకపోతే ఆడియన్స్ కి ఈసారి కంప్లీట్ ఫీల్ ఇచ్చేందుకు ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ సినిమాలను కలిపేసి ‘బాహుబలి – ది ఎపిక్’ గా (Baahubali-The Epic) గా అక్టోబర్ 31న రీ రిలీజ్ చేశాడు. ఈసారి కూడా బాహుబలి రికార్డులు సృష్టించింది. రీ- రిలీజ్ సినిమాల్లో కూడా రాజమౌళి సినిమాల తర్వాతే ఏ సినిమా అయినా.. అనేలా చేసింది. 10 రోజులు అయినా ‘బాహుబలి- ది ఎపిక్’ కలెక్షన్స్ తగ్గడం లేదు.

ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 9.26 cr |
| సీడెడ్ | 2.12 cr |
| ఆంధ్ర(టోటల్) | 7.38 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 18.76 cr (షేర్) |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 10.27 cr |
| ఓవర్సీస్ | 11.75 cr |
| మిగిలిన వెర్షన్లు | 9.62 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 50.4 కోట్లు (గ్రాస్) |
‘బాహుబలి – ది ఎపిక్’ (Baahubali-The Epic) సినిమా 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.50.4 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. రీ- రిలీజ్ సినిమాల్లో ఆల్ టైం రికార్డులు సృష్టించింది.
