మహాభారతం కోసం బాహుబలి రైటర్ తో అమీర్ ప్రయత్నాలు

భారత ఇతిహాసాలలో మహాభారతం గొప్ప కావ్యంగా ఉంది. హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటైన మహాభారతం పై దశాబ్దాలుగా అనేక సినిమాలు వివిధ భాషలలో తెరకెక్కడం జరిగింది. ఐతే దీనిని భారీ ఎత్తున్న అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించాలని ఎప్పటి నుండో ప్రయత్నాలు జరిగుతున్నాయి. ఆధునిక సాంకేతికత ఉపయోగించుకొని విజువల్ వండర్ గా తెరకెక్కించాలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రణాళికలలో ఉన్నారు. వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా ఒకరు.

ఆయన ఎప్పటి నుండో ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తిగా ఉన్నారు. కాగా తాజాగా ఆయన ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారట. అమీర్ టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారిని సంప్రదించారట. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేయలవసిందిగా కోరారట. వీరి మధ్య ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందట. అన్నీ కుదిరితే ఈ భారీ ప్రాజెక్ట్ కి ఆయన కథారూపం మరియు స్క్రీన్ ప్లే అందించనున్నారట. ఒక వేళ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే అతి పెద్ద సంచలనానికి తెరలేచినట్లే.

ఇక ఈ ప్రాజెక్ట్ లో దేశంలో అనేక పరిశ్రమలకు చెందిన స్టార్ క్యాస్ట్ నటించడం ఖాయం. ఈ చిత్ర బడ్జెట్ 500కోట్ల రూపాయలకు పై మాటేనట. మరి అమీర్ ఖాన్ ప్రయత్నాలు ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి. మరో వైపు దర్శకుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రం ఉండగా ఆయన ఎప్పటికైనా మహాభారతం తెరకెక్కిస్తానని చెవుతున్నారు.

Most Recommended Video
b
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus