బాహుబలి 2 ఫస్ట్ డే కలక్షన్స్

బాహుబలి తాను రాసిన రికార్డులు తానే తిరగరాసుకుంటున్నాడు. బిగినింగ్ పేరిట నమోదైన రికార్డులన్నింటినీ కంక్లూజన్ బద్దలు కొడుతోంది. రాజమౌళి వెండితెరపై చెక్కిన అపురూపం శిల్పం బాహుబలి 2 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 9,000 తెరలపై విడుదలై సంచలనం సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా 6,500 థియేటర్లలో రిలీజ్ అయినా ఈ మూవీ 96 శాతం ఆక్యుపెన్సీ సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం మనదేశంలోనే ఒక్కరోజులో 125 కోట్ల గ్రాస్ రాబట్టి ఔరా అనిపించింది. అమెరికాలో 8 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఈ మార్క్ ని చేరిన తొలి భారతీయ చిత్రంగా చరిత్రలోకి ఎక్కింది. అక్కడ గురువారం నుంచి ప్రీమియర్ షోస్ మొదలుకావడంతో శుక్రవారం చివరి షో ముగిసే నాటికీ దాదాపు 50 కోట్లు వచ్చిన్నట్లు అక్కడి ట్రేడ్ వర్గాల వారు చెప్పారు.

దేశంలో బాహుబలి 2 కలక్షన్స్ వివరాలు (గ్రాస్ కోట్లలో)

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ : 55 (దాదాపు)
నైజాం 8.70
సీడెడ్ 6.10
గుంటూరు 6.18
ఈస్ట్ 5.93
వెస్ట్ 6.08
కృష్ణ 2.82
నెల్లూరు 2.10

హిందీ మార్కెట్ : 38
కర్ణాటక : 12
కేరళ : 9
తమిళనాడు : 11


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus