Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Reviews » Baak Review in Telugu: బాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Baak Review in Telugu: బాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 3, 2024 / 05:59 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Baak Review in Telugu: బాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సుందర్.సి (Hero)
  • తమన్నా, రాశీఖన్నా (Heroine)
  • కోవై సరళ, యోగిబాబు తదితరులు.. (Cast)
  • సుందర్.సి (Director)
  • ఖుష్బూ సుందర్ - ఏ.సి.ఎస్.అరుణ్ కుమార్ (Producer)
  • హిప్ హాప్ తమిళ (Music)
  • కృష్ణసామి (Cinematography)
  • Release Date : మే 03, 2024
  • అవ్ని సినీమాక్స్ - బెంజ్ మీడియా (Banner)

“ముని” సిరీస్ తరహాలో తమిళంలో పాపులర్ అయిన మరో హారర్ సిరీస్ “ఆరణ్మనై”. ఈ సిరీస్ లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా.. అందులో రెండు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మూడో పార్ట్ మాత్రం సరిగా ఆడలేదు. అయినాసరే.. నటుడు/దర్శకుడు సుందర్.సి (Sundar. C) ఈ సిరీస్ లో నాలుగో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. గ్లామర్ డాల్స్ తమన్నా (Tamannaah Bhatia) , రాశీఖన్నాల (Raashii Khanna) స్పెషల్ సాంగ్ & హాట్ స్టిల్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. తమిళంలో “ఆరణ్మనై 4”, తెలుగులో “బాక్”గా ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరిస్తుందో చూద్దాం..!!

కథ: శివాని (తమన్నా) ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. ఆమె చనిపోయిన కొద్దిరోజులకే ఆమె భర్త కూడా మరణిస్తాడు. తన చెల్లెలు అర్ధాంతరంగా మరణించడం వెనుక ఏదో అంతుబట్టని కారణం ఉందని, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగుతాడు లాయర్ శివ శంకర్ (సుందర్.సి).  శివ శంకర్ ఇన్వెస్టిగేషన్ లో వెలుగుచూసిన నమ్మలేని నిజాలు ఏమిటి? శివాని ఎందుకని ఆత్మహత్య చేసుకుంది? వంటి ప్రశ్నలకు సమాధానమే “బాక్” చిత్రం.

నటీనటుల పనితీరు: రజనీకాంత్ “అరుణాచలం” దర్శకుడిగా ప్రేక్షకులకు సుపరిచితుడైన సుందర్.సి అడపాదడపా సినిమాల్లో నటిస్తూ కథానాయకుడిగానూ అలరించడానికి చేసే ప్రయత్నం ఇప్పటివరకూ ఫలించలేదు. “బాక్” సినిమాలోనూ అదే రిపీట్ అయ్యింది. శివ శంకర్ పాత్రను వేరే సీనియర్ హీరో లేదా యంగ్ హీరో ఎవరైనా చేసి ఉంటే బాగుండేది.

తమన్నా నటనతో అలరించగా.. రాశీఖన్నా సినిమాకి మంచి గ్లామర్ యాడ్ చేసింది. యోగిబాబు (Yogi Babu) , వెన్నెల కిషోర్ (Vennela Kishore) , శ్రీనివాస్ రెడ్డిల (Srinivasa Reddy) కామెడీ పెద్దగా వర్కవుటవ్వలేదు. ఇంకా చెప్పాలంటే.. వాళ్ళ కామెడీ ట్రాక్ లు సినిమాకి మైనస్ గా నిలిచాయి.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. జంప్ స్కేర్ షాట్స్ & రోబోటిక్ షాట్ టెక్నాలజీని వినియోగించుకున్న తీరు ప్రశంసనీయం. మన సౌత్ ఇండస్ట్రీలో ఒక రెగ్యులర్ హారర్ సినిమాలో ఈస్థాయి టెక్నాలజీని ఎప్పుడూ చూసి ఉండం. అందుకు సినిమాటోగ్రాఫర్ కృష్ణసామి అభినందనీయుడు. హిప్ హాప్ (Hiphop Tamizha) తమిళ నేపధ్య సంగీతం బాగుంది. కొన్ని హారర్ ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేశాడు. ప్రొడక్షన్ డిజైన్, కలరింగ్, డి.ఐ, సౌండ్ డిజైనింగ్ తదితర అంశాలన్నీట్లో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు టెక్నికల్ టీం.

రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ సుందర్.సి క్లైమాక్స్ & ఇంటర్వెల్ బ్లాక్స్ ను రాసుకున్న, కంపోజ్ చేసుకున్న విధానం బాగుంది.  ఈ రెండు మినహా మిగతా సినిమా మొత్తం ఒక టెంప్లేట్లో చాలా సాదాసీదాగా సాగింది. అందువల్ల మాస్ ఆడియన్స్ ను కూడా పూర్తిస్థాయిలో అలరించలేకపోయిందీ చిత్రం. సో, ఒక దర్శకుడిగా, కథకుడిగా సుందర్.సి ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి.

విశ్లేషణ: తమన్నా, రాశీఖన్నా గ్లామర్ & సుందర్.సి మార్క్ కామెడీ సీన్స్ ఉంటాయని థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు కచ్చితంగా నిరాశచెందుతారు. గ్లామర్, టెక్నికాలిటీస్ తోపాటు కథ-కథనం, సన్నివేశాలను కంపోజ్ చేసే తీరుకు కూడా ప్రాధాన్యత ఇస్తే తప్పితే ఈమధ్యకాలంలో సినిమాను ప్రేక్షకులు ఆదరించడంలేదు. ఈ విషయాన్ని సుందర్.సి ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది!

ఫోకస్ పాయింట్: బెంబేలెత్తించిన “బాక్”.

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baak
  • #Raashii Khanna
  • #Sundar C
  • #Tamannaah Bhatia

Reviews

Love OTP Review in Telugu: లవ్ OTP సినిమా రివ్యూ & రేటింగ్!

Love OTP Review in Telugu: లవ్ OTP సినిమా రివ్యూ & రేటింగ్!

De De Pyaar De 2 Review in Telugu: దే దే ప్యార్ దే 2 సినిమా రివ్యూ & రేటింగ్!

De De Pyaar De 2 Review in Telugu: దే దే ప్యార్ దే 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Delhi Crime 3 Review in Telugu: ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Delhi Crime 3 Review in Telugu: ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Jigris Review in Telugu: జిగ్రీస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jigris Review in Telugu: జిగ్రీస్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Chiranjeevi: ‘భోళా శంకర్’ జోడీ మరోసారి?

Chiranjeevi: ‘భోళా శంకర్’ జోడీ మరోసారి?

Tamannaah Bhatia: బరువు తగ్గడానికి తమన్నా ఇంజిక్షన్స్‌ వాడుతోందా?

Tamannaah Bhatia: బరువు తగ్గడానికి తమన్నా ఇంజిక్షన్స్‌ వాడుతోందా?

trending news

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

17 hours ago
Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

2 days ago
Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

2 days ago
Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

2 days ago

latest news

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

9 hours ago
THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

9 hours ago
RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

10 hours ago
PEDDI: పెద్ది.. మిగతా పాటలకు ఇదో పెద్ద తలనొప్పి!

PEDDI: పెద్ది.. మిగతా పాటలకు ఇదో పెద్ద తలనొప్పి!

10 hours ago
VARANASI: రాజమౌళికి అసలైన పరీక్ష.. ‘వారణాసి’ గ్లోబల్ మోజులో పడితే కష్టమే!

VARANASI: రాజమౌళికి అసలైన పరీక్ష.. ‘వారణాసి’ గ్లోబల్ మోజులో పడితే కష్టమే!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version