Baba Re-Release: ‘బాబా’ మూవీ గురించి సూపర్ స్టార్ రజినీ కాంత్ ఎమోషనల్ పోస్ట్..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.. అదేంటి.. ‘బీస్ట్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌తో చేస్తున్న ‘జైలర్’ ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు కదా.. అప్పుడే రిలీజ్ ఏంటి అనుకుంటున్నారా?.. మరేం లేదు.. రజినీ ‘బాబా’ మూవీని త్వరలో రీ రిలీజ్ చేయబోతున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. దానికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి..

తలైవాకి ‘బాషా’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు సురేష్ కృష్ణ.. ‘బాబా’ తీశారు. దీనికి రజినీ కాంత్ కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాతగా వ్యవహరించారు. మనీషా కోయిరాలా కథానాయిక. ఎ.ఆర్. రెహమాన్ సంగీతమందించారు. రజినీ తన నిజ జీవిత అనుభవాల ఆధారంగా.. దైవ భక్తి నేపథ్యంలో కథ రాశారు. 2002 ఆగస్టు 15న తమిళ్, తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ అయింది ‘బాబా’.. ‘బాషా’ కాంబినేషన్.. పైగా రజినీ ఎంతో ఇష్టపడి చేసిన సినిమా కావడంతో బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి..

విడుదల తర్వాత వాటిని అందుకోలేకపోయింది.. ‘బాబా’ కారణంగా తీవ్రంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను తలైవా ఆదుకోవడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది.. 20 సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. శనివారం (డిసెంబర్ 3) సాయంత్రం ‘బాబా’ ట్రైలర్ (తమిళ్) సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు రజినీ.. ఈ సినిమా తన మనసుకి బాగా దగ్గరైందంటూ కామెంట్ చేశారు. ఫిలింకి ఇప్పటి టెక్నాలజీని అమర్చారు.

డిజిటల్, డీటీఎస్, కలర్ గ్రేడింగ్ వంటి వాటితో రీమాస్టర్డ్ వెర్షన్ రెడీ చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు కట్ చేసి ఎడిట్ చేశారని అంటున్నారు. ట్రైలర్ క్లారిటీ, సౌండ్ క్వాలిటీ బాగుంది. రజినీ పుట్టినరోజు (డిసెంబర్ 12) సందర్భంగా తమిళ్ వెర్షన్ రిలీజ్ డేట్‌తో పాటు తెలుగులో విడుదల చేస్తారా, లేదా అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశముందని సమాచారం.

 

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus