Babloo Prithiveeraj: నా మొదటి భార్యతో గొడవలు అందుకే సహజీవనం సాగిస్తున్నాను!
- October 29, 2022 / 03:27 PM ISTByFilmy Focus
ఒకప్పటి హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ అయిన బబ్లూ పృథ్వీ రాజ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ‘నాన్ వళవయ్యప్పన్’ అనే తమిళ సినిమాలో బబ్లూ అనే పేరుతో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడితను.1990, 2000 లలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన చాలా సినిమాల్లో ఇతను హీరోగా, సహాయ నటుడిగా, విలన్ గా నటించాడు. అయితే ‘పెళ్లి’ ‘పెళ్లి పందిరి’ ‘ప్రేయసి రావే’ ‘సమరసింహా రెడ్డి’ ‘దేవుళ్ళు’ ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘చెన్నకేశవరెడ్డి’ ‘గౌతమ్ ఎస్.ఎస్.సి’ వంటి చిత్రాలు ఇతనికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.
ఈ మధ్య కాలంలో ఇతను ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు. ఇటీవల ఇతను సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. 57 వయసున్న పృథ్వీ 23 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరగడంతో ఇతని పై విమర్శలు గుప్పించారు నెటిజన్లు. వాటికి పృథ్వీ రాజ్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అతను మాట్లాడుతూ.. “చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు.

ఈ మధ్య నేను రెండో పెళ్లి చేసుకున్నందుకు ట్రోల్స్ వస్తున్నాయి. ఈ విషయం పై నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కాకపోతే.. శీతల్ అనే అమ్మాయితో నేను సహజీవనంలో ఉన్నాను. ఆమె వయసు 24 ఏళ్లు. త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నా మొదటి భార్య బీనాతో సుమారు 6 ఏళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. దాంతో నేను బయటకు వచ్చేసి వేరుగా ఉంటున్నా.
\
ఒంటరితనాన్ని మించిన నరకం మరొకటి లేదు. అలాంటి పరిస్థితి నేనూ అనుభవించాను. అలాంటి సమయంలో శీతల్ తో నాకు పరిచయం ఏర్పడింది. మా అభిరుచులు కలిశాయి. స్నేహితులమయ్యాం . ప్రస్తుతం రిలేషన్లో ఉన్నాం. ఆమె ఎంతో పరిణతి చెందిన వ్యక్తి” అంటూ పృథ్వీ రాజ్ చెప్పుకొచ్చాడు. ఇక శీతల్ మాట్లాడుతూ.. ” పృథ్వీ మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు,మా పెళ్లికి వాళ్లందరూ అంగీకారం తెలిపారు” అంటూ చెప్పుకొచ్చింది.
జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!















