ఆ హీరో నా ఫేవరెట్ హీరో అంటున్న బబ్లూ పృథ్వీరాజ్!

ప్రముఖ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ ఇప్పటికీ మంచి పాత్రలను సొంతం చేసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. బాలకృష్ణ సినిమాలలో బబ్లూ పృథ్వీరాజ్ ఎక్కువగా నటించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బబ్లూ పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. కోటీ 60 లక్షల రూపాయల చెక్స్ బౌన్స్ అయ్యాయని పృథ్వీరాజ్ అన్నారు. నేను దూరదర్శన్ లో పని చేసిన సమయంలో నా రెమ్యునరేషన్ 1500 అని పృథ్వీరాజ్ అన్నారు.

నేను యాక్టింగ్ ను ఇష్టపడతానని ఆయన తెలిపారు. రెమ్యునరేషన్ విషయంలో నాకు పట్టింపులు లేవని ఆయన చెప్పుకొచ్చారు. బాలయ్య అన్నగారు అంటే చాలా ఇష్టమని పృథ్వీరాజ్ తెలిపారు. సమరసింహారెడ్డి సినిమాలో నేను వాసు అనే పాత్ర చేశానని చావుబ్రతుకుల మధ్యలో ఉన్న నన్ను ఎత్తుకుని వెళ్లే సీన్ ఉంటుందని పృథ్వీరాజ్ అన్నారు. స్టంట్ మాస్టర్ ఆ సీన్ ను చూపించాలని ప్రయత్నించి నన్ను మోయలేక స్టంట్ మాస్టర్ రెండు స్టెప్పులు కూడా మోయలేకపోయాడని పృథ్వీరాజ్ వెల్లడించారు.

ఆ సమయంలో నా బరువు 85 కేజీలు అని పృథ్వీరాజ్ తెలిపారు. బాలయ్య గారు నన్ను ఎత్తుకుని 50, 60 అడుగులు వేశారని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఎలా చేశారని నేను అడిగితే బాలయ్య నేను కాదని సమరసింహారెడ్డి చేశాడని అన్నారని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. నందమూరి హీరోలైన సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ నాకు ఇష్టమని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.

ఈ ముగ్గురు హీరోలతో కలిసి నేను పని చేశానని పృథ్వీరాజ్ అన్నారు. నిర్మాతగా చేసిన సినిమాల ద్వారా భారీ మొత్తంలో నష్టపోయానని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. మలేషియాలో బబుల్ టీ బిజినెస్ ఓపెన్ చేశానని అందులో కూడా నష్టపోయానని పృథ్వీరాజ్ అన్నారు. నేను నిర్మాతగా చేసిన మూడు సినిమాలు వేర్వేరు కారణాల వల్ల ఫ్లాప్ అయ్యాయని పృథ్వీరాజ్ కామెంట్లు చేశారు. బబ్లూ పృథ్వీరాజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus