Baby Annie: హాట్ టాపిక్ గా మారిన ‘రంగస్థలం’ చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ అన్ని పెళ్లి కూతురు ఫోటో!

‘రంగస్థలం’ చిత్రంలో రాంచరణ్, ఆది పినిశెట్టిలకి చెల్లి పాత్రలో కనిపించిన పాప అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాప పేరు అన్ని. అంతకు ముందు ఈ పాప ‘అనుకోకుండా ఒకరోజు’ ‘స్టాలిన్’ ‘మధుమాసం’ ‘విజయదశమి’ ‘అతిథి’ ‘స్వాగతం’ ‘రెడీ’ ‘శౌర్యం’ ‘మిత్రుడు’ ‘ఏక్ నిరంజన్’ ‘ఖలేజా’ వంటి సినిమాల్లో కూడా నటించింది. అయితే ఆ తర్వాత చేసిన ‘రాజన్న’ చిత్రం ఈ పాపకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో రాజన్న(నాగార్జున) కూతురు పాత్రలో ఈమె చాలా చక్కగా నటించింది.

ఆ సినిమాకి గాను బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా నంది అవార్డుని కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ మధ్య ఈ పాప ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. ‘రంగస్థలం’ తర్వాత ఈమె మరో సినిమాలో కనిపించలేదు అని కూడా చాలా మంది చెబుతుంటారు. అయితే తాజాగా అన్ని పెళ్లి కూతురు గెటప్ లో కనిపించి షాకిచ్చింది. అదేంటి ఈ పాప అప్పుడే పెళ్లి చేసుకోబోతుందా అనే డౌట్ మీకు రావచ్చు. ప్రస్తుతం ఆమె (Baby Annie) వయసు 22 ఏళ్ళు.

అలా అని ఆ పాప ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు లెండి. ఓ సినిమా షూటింగ్లో భాగంగా ఆమె ఈ గెటప్ లోకి మారింది. వివరాల్లోకి వెళితే.. ‘తికమక తాండ’ అనే చిత్రంలో ఈ పాప హీరోయిన్ గా నటిస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ కూడా పల్లెటూరిలో జరుగుతుంది. ఓ సన్నివేశంలో భాగంగా అన్ని ఈ గెటప్ లో మెరిసినట్టు తెలుస్తుంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus