Baby Collections: 11వ రోజు కూడా కోటి పైనే షేర్ ..పెద్ద సినిమాలకి కూడా అసాధ్యమైన ఫీట్..?

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ చిత్రం జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘మాస్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఎస్.కె.ఎన్ నిర్మించారు. విరాజ్ అశ్విన్ మరో హీరోగా నటిస్తుండగా వైష్ణవి హీరోయిన్ గా నటించింది. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది.

వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా సూపర్ గా కలెక్ట్ చేసింది అని చెప్పాలి. ఇక రెండో వీకెండ్లో కూడా అద్భుతంగా కలెక్ట్ చేసింది. ఈ మధ్య కాలంలో ఓ చిన్న సినిమా ఇంత బాగా పెర్ఫార్మ్ చేసింది అంటూ ఉంటే అది ‘బేబీ’ మాత్రమే.11 వ రోజు కూడా ఈ మూవీ కోటి పైనే షేర్ ను కలెక్ట్ చేసింది. ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 12.64 cr
సీడెడ్ 4.21 cr
ఉత్తరాంధ్ర 4.77 cr
ఈస్ట్ 2.13 cr
వెస్ట్ 1.20 cr
గుంటూరు 1.49 cr
కృష్ణా 1.66 cr
నెల్లూరు 0.91 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 29.01 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.48 cr
 ఓవర్సీస్ 2.41 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 32.90 cr (షేర్)

బేబీ (Baby) మూవీకి రూ. 5.8 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 11 రోజులు పూర్తయ్యేసరికి రూ.32.9 కోట్లు షేర్ ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ చిత్రం రూ.32.9 కోట్ల భారీ లాభాలను అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా ఇప్పటికీ భారీ కలెక్షన్స్ ను సాధిస్తుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus