సినీ పరిశ్రమలో విషాదం.. నిర్మాత ఎస్.కె.ఎన్ కి పితృవియోగం!

2023 లో చాలా మంది సినీ ప్రముఖులు, సినీ పరిశ్రమకు చెందిన వారి కుటుంబ సభ్యులు మరణించిన సందర్భాలు ఎన్నో చూశాం. తారకరత్న, శరత్ బాబు, కె.విశ్వనాథ్, చంద్రమోహన్ వంటి టాలీవుడ్ సెలబ్రిటీలు మరణించడంతో.. అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక ఈ ఏడాది అయినా అంతా బాగుంటుంది అనుకుంటే.. 2024 ప్రారంభమైన 4 రోజులకే బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఓ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ‘బేబీ’ నిర్మాత అయిన ఎస్.కె.ఎన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఎస్.కె.ఎన్ తండ్రి గారు అయిన గాదె సూర్యప్రకాశరావు గారు ఈరోజు ఉదయం కన్నుమూశారు. వయోభారం కారణంగా కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆయన ఈరోజు మరణించినట్టు తెలుస్తుంది. దీంతో ఎస్.కె.ఎన్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అలాగే ఇండస్ట్రీ జనాలు కూడా ఎస్.కె.ఎన్ ని తలుచుకుని చాలా బాధపడుతున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక ‘ఎస్.కె.ఎన్’ ఓ జర్నలిస్ట్ గా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి..

తర్వాత అల్లు అర్జున్, ‘గీతా ఆర్ట్స్’ సంస్థలకి పీ.ఆర్.ఓ గా పనిచేశారు. మారుతీతో కలిసి కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు. అటు తర్వాత నిర్మాతగా కూడా మారి ‘ఈరోజుల్లో’ ‘టాక్సీ వాలా’ ‘బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు నిర్మించారు. ‘బేబీ’ సినిమా ఎస్.కె.ఎన్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. త్వరలోనే ఆ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయబోతున్నారు ఎస్.కె.ఎన్ (SKN) అని అల్లు అరవింద్ ఇటీవల రివీల్ చేశారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags