అభిమానులకు సెల్వరాఘవన్ చేసిన ట్వీట్ వైరల్..!

  • August 1, 2020 / 02:51 PM IST

అవును.. ఓ స్టార్ డైరెక్టర్ తన అభిమానులకు చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. ‘7/జి బృందావన కాలని’ ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు సెల్వరాఘవన్. ఈయన .. 2006 డిసెంబర్ లో ‘7/జి బృందావన్ కాలనీ’ హీరోయిన్ సోనియా అగర్వాల్‌ నే ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ళ పాటు బాగానే కలిసున్నారు కానీ..

తరువాత మనస్పర్థలు రావడంతో 2010 లో విడిపోయారు. అటు తరువాత.. గీతాంజలి రామన్‌ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ను 2011లో రెండో పెళ్లి చేసుకున్నాడు సెల్వ రాఘవన్. ఈ దంపతులకు ఇప్పటికే.. లీలావతి, ఓంకార్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు కూడా తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు సెల్వ రాఘవన్. దీంతో అతని అభిమానులు అలాగే సన్నిహితులు పెద్ద ఎత్తున విషెస్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే కొంతమంది ఆకతాయి మూక.. ‘ఇంకా యుద్ధం ఆపలేదా’ అంటూ చెత్త కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. దాంతో ఈ టాపిక్ మరింత వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ధనుష్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు సెల్వ రాఘవన్.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus