అల్లరి నరేష్ (Allari Naresh) ,అమృత అయ్యర్ (Amritha Aiyer) జంటగా నటించిన చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachhala Malli). ‘సోలో బ్రతుకే సో బెటర్’ తో (Solo Brathuke So Better) డీసెంట్ హిట్ అందుకున్న సుబ్బు (Subbu Mangadevi) దర్శకత్వం వహించిన సినిమా ఇది. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా.. రిలీజ్ కి ముందు కొద్దిపాటి బజ్ క్రియేట్ చేసుకుంది. కానీ డిసెంబర్ 20న రిలీజ్ అయిన ఈ సినిమా ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. అందువల్ల రిలీజ్ ముందు ఏర్పడిన బజ్ ను క్యాష్ చేసుకోలేకపోయింది.
‘బచ్చల మల్లి’ (Bachhala Malli) సినిమాకు రూ.5.35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్లో ఈ సినిమా కేవలం రూ.1.68 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అది కూడా నెగిటివ్ షేర్స్ వంటివి తీసేయగా అని చెప్పాలి. ఏదేమైనా రూ.4.32 కోట్ల దూరంలో ఆగిపోయి ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.