Pushpa: ‘పుష్ప’ వాక్‌ గురించి బన్నీ ఇంట్రెస్టింగ్‌ ఇన్ఫో!

‘పుష్ప’ సినిమా ప్రచారం మొదలెట్టినప్పటి నుండి అందరి దృష్టి ఆకర్షించిన అంశాలు అంటే.. తగ్గేదేలే మేనరిజం, రెండోది ఆ నడక. ఈ రెండింటితోనే సినిమాకు విపరీతమైన హైప్‌ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. మేనరిజం గురించి ఇప్పటికే బన్నీ చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు ఆ నడక గురించి బన్నీ మాట్లాడాడు. దీంతో ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అలాగే ‘పుష్ప 2’లో మేనరిజమ్స్‌ గురించి కూడా బన్నీ మాట్లాడాడు. ‘పుష్ప’రాజ్‌ పాత్ర కోసం బన్నీ ప్రత్యేకంగా సిద్ధమయ్యారనే విషయం తెలిసిందే.

‘పుష్ప’ ప్రచారంలో ఈ విషయాలు చెప్పారు కూడా. చిత్తూరు యాసతో పాటు, ఒక భుజం పైకెత్తి నడవటం ప్రేక్షకులకు ఆసక్తిగా అనిపించింది. ‘‘ఆ సిగ్నేచర్‌ వాక్‌ వెనుక క్రెడిట్‌ మొత్తం దర్శకుడు సుకుమార్‌దే. సినిమా చిత్రీకరణ మొదలు పెట్టేముందు ఒక రోజు సుకుమార్‌ వచ్చి, ‘నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ సినిమాలో నీ వాకింగ్‌ స్టైల్‌ ట్రెండ్‌ అయిపోవాలి’’అన్నారట. దీంతో భుజం పైకి ఎత్తి నడిచే స్టైల్‌ చూపించాడ బన్నీ.

ఆ నడక తెగ నచ్చేయడంతో దానినే సుకుమార్‌ సినిమాలో యాజ్‌ ఇట్‌ ఈజ్‌ పెట్టేశారట. తొలిసారి అలా నడిచినప్పుడు యువతలో ఇంత ట్రెండ్‌ అవుతుందనుకోలేదు అని అన్నాడు అల్లు అర్జున్‌. సినిమా బీ,సీ సెంటర్ల ప్రేక్షకులకు బాగా నచ్చితే, అందరికీ చేరిపోతుందని నమ్ముతాను నేను. ‘పుష్ప’ విషయంలో అదే జరిగింది అని అన్నాడు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹350కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక పార్ట్‌ 2లో బన్నీ మేనరిజమ్స్‌ ఇంకా సూపర్‌ ఉండబోతున్నాయట.

‘పుష్ప 1’లో తగ్గేదేలే అంటూ చెప్పిన బన్నీ.. రెండో కుమ్మేస్తా అనే పదాన్ని వాడనున్నట్లు సమాచారం. అది కూడా డిఫరెంట్‌ మాడ్యులేషన్‌లో ఉంటుందట. అలాగే వాకింగ్‌ అలానే ఉన్నా.. అందులో కొత్తదనం చూపించేలా చూస్తారట. తొలి సినిమాలో కేవలం పుష్పరాజ్‌ రైజ్‌ మాత్రమే చూపించారు. ఇప్పుడు రూల్‌ చూపించాలి కాబట్టి ఆ స్థాయికి తగ్గ మేనరిజమ్స్‌ ఉంటాయి అంటున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus