పూజా హెగ్డే కు బాలీవుడ్ నుంచి మొదలైన ఫ్లాప్స్!

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని క్రేజీ కథానాయికగా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే, ఇప్పుడు విజయాలు లేక వెలవెలబోతోంది. హిందీ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా చూసిన ప్రేక్షకులు ‘పాపం పూజా హెగ్డే’ అని సానుభూతి చూపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం వచ్చినా సరే… సరైన హిట్ అందలేదని, అసలు ఆమె అదృష్టం కొన్ని రోజుల నుంచి బాలేదని జాలి పడుతున్నారు.

‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’కు బాలీవుడ్ మీడియాలో బీభత్సమైన నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఒకరిద్దరు మినహా ఆల్మోస్ట్ అందరూ సినిమాను ఏకిపారేశారు. ఫ్లాప్ అని తేల్చేశారు. ఈ పరాజయంతో పూజా హెగ్డే ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ చేరినట్టు అయ్యిందని కామెంట్ చేశారు. డబుల్ హ్యాట్రిక్ అంటే హిట్స్ కాదు… ఫ్లాప్స్ తెలుగు ఇండస్ట్రీ పూజా హెగ్డేకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందించింది. విజయాల్లో డబుల్ హ్యాట్రిక్ అందించింది.

మధ్యలో ‘సాక్ష్యం’ను పక్కన పెడితే… ‘దువ్వాడ జగన్నాథం’ నుంచి ‘అల వైకుంఠపురములో’ సినిమా వరకు, పూజా హెగ్డే చేసిన ప్రతి సినిమా హిట్టే. ఆఖరికి ‘జిల్ జిల్ జిల్ జిగేలు రాణి’ అంటూ స్పెషల్ సాంగ్ చేసిన ‘రంగస్థలం’ కూడా హిట్టే. పూజా హెగ్డేను గోల్డెన్ లెగ్ అని తెలుగులో అందరూ ప్రశంసలు కురిపించారు. ‘అల వైకుంఠపురములో’ సినిమా విడుదల తర్వాత నుంచి పూజా హెగ్డే పరిస్థితి అసలు బాలేదు. అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

కలెక్షన్స్ రాబట్టింది. కానీ, ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. తెలుగులో పూజా హెగ్డే విజయాలు చూసి బాలీవుడ్ దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అవకాశాలు అయితే ఇచ్చారు గానీ… విజయాలు మాత్రం ఇవ్వడం లేదు. హిందీలో ఆమెకు వరుస ఫ్లాప్స్ వస్తున్నాయి. మధ్యలో చేసిన తెలుగు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ నుంచి లేటెస్ట్ సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ వరకు అన్నీ ఫ్లాపులే.

తమిళంలో స్టార్ హీరో విజయ్ జోడిగా నటించిన ‘బీస్ట్’, తెలుగులో రామ్ చరణ్ జోడిగా కనిపించిన ‘ఆచార్య’, హిందీలో రణ్ వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ‘సర్కస్’… ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. క్రిటిక్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంది. ‘రాధే శ్యామ్’, ‘బీస్ట్’ సినిమాల్లో పూజా హెగ్డే యాక్టింగ్ ట్రోలింగ్ మెటీరియల్ అయ్యింది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus