సీనియర్ హీరోయిన్స్ ఫామ్లోకి వచ్చినట్టేగా..!

గత రెండు, మూడు నెలలుగా చూసుకుంటే సీనియర్ హీరోయిన్స్ మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్టే కనిపిస్తుంది. రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలో తమన్నా నటించింది. అందులో ఆమెది చిన్న పాత్రే అయినా… కథకి కీలకంగా మారిపోవడం, ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అందుకోవడం.. తమన్నాకి కలిసొచ్చినట్టు అయ్యింది. ఇప్పుడు తమన్నా ఖాతాలో సినిమాల సంఖ్య గట్టిగానే ఉన్నట్టు టాక్. వెబ్ కంటెంట్ రూపంలో కూడా ఆమె గట్టిగా వసూలు చేస్తుంది. సో తమన్నా ఇంకో రెండేళ్లపాటు ఛాన్స్ ల కోసం ఇబ్బంది పడనవసరం లేదు.

ఇక అనుష్క కూడా ఇంచుమించు అంతే..! ఆమె హైట్ వల్ల యంగ్ హీరోల పక్కన చేసే అవకాశం లేదు అన్నవారికి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ గట్టి సమాధానం చెప్పింది అనాలి. ఎందుకంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కథ డిమాండ్ చేయాలి కానీ యంగ్ హీరోలతో అయినా అనుష్క బాగా సెట్ అవుతుంది అనే విషయాన్ని చాటి చెప్పింది.

ఇక నయనతార ఇప్పటికీ సూపర్ ఫామ్లో ఉంది. తెలుగులో అంతగా సినిమాలు చేయడం లేదు అనే కంప్లైంట్ ఉన్నా .. ‘గాడ్ ఫాదర్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఇప్పుడు ‘జవాన్’ కూడా సక్సెస్ అందుకోవడంతో.. బాలీవుడ్లో కూడా ఆమె బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  ఇక కాజల్ కూడా ‘భగవంత్ కేసరి’ తో హిట్ అందుకుంటే.. ఆమె కూడా ఫామ్లోకి వచ్చినట్టే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus