నాలుగు రోజుల్లోనే ముగ్గురు మృతి

సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక ఆయన జీవితానికి సంబంధించిన అనేక రకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రస్తుత టాలీవుడ్ స్టార్ దర్శకుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ రచయితకు అల్లుడు అని అందరికి తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో వరుస మరణాలు సంభవించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నవంబర్ 30వ తేదీన మంగళవారం సాయంత్రం న్యూమోనియా కారణంగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఇక ఇటీవల నవంబర్‌ 28న సౌత్ లోనే సీనియర్ మోస్ట్ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ ఊపిరితిత్తుల సమస్యల వలన హాస్పిటల్ లో చావుతో పోరాడుతూ కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు కేఎస్‌ నాగేశ్వరరావు ఇక నవంబర్ 27న గుండెపోటుతో మరణించడం అందరిని షాక్ కు గురి చేసింది.సిరివెన్నెల సీతారామశాస్త్రి, శివశంకర్ మాస్టర్, కెఎస్.నాగేశ్వరరావు ఇలా వరుసగా సినీ ప్రముఖులు ఒకరి తరువాత మరొకరు నాలుగు రోజుల వ్యవధిలోనే కన్నుమూయడంతో

తెలుగు చిత్రపరిశ్రమలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ముగ్గురు ప్రముఖులు మరణించడంపై కూడా చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా స్టార్ నటీనటులు కూడా ఈ ప్రముఖులకు సంతాపం తెలియజేశారు. ఇక సిరివెన్నెల మంగళవారం మృతి చెందగా ఆయన అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus