Santosh Sobhan: సంతోష శోభన్ టైం ఇంత బ్యాడ్ గా ఉందేంటి?

‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు’… దీనికి హీరో సంతోష్ శోభన్ ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తాడు. ఎందుకంటే చాలా మంది టాలెంటెడ్ హీరోలకు.. పెద్ద బ్యానర్లలో సినిమాలు రాక ఇబ్బంది పడుతున్నారు. కానీ సంతోష్ శోభన్ కు మాత్రం పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసే అవకాశాలు లభిస్తున్నాయి. అందుకు కారణం కూడా ఉంది. ఇతని తండ్రి శోభన్ ‘వర్షం’ వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించాడు. మహేష్ బాబు, రవితేజ వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేశాడు.

రైటర్ గా ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పనిచేశాడు. కానీ చాలా సినిమాలకు రైటర్ గా అతని పేరు పడింది లేదు. ‘మురారి’ చిత్రానికి మాత్రమే డైలాగ్ రైటర్ గా స్క్రీన్ పై పేరు పడింది. శోభన్ కు కూడా ఎక్కువగా డబ్బు, పేరు సంపాదించాలనే కోరిక ఉండేది కాదు. పైగా ఇతను కమెడియన్ లక్ష్మీపతి తమ్ముడు కూడా..! సంతోష్ తండ్రి, పెదనాన్న… లకు ఇండస్ట్రీలో ఉన్న మంచి పేరు కారణంగానే పెద్ద బ్యానర్లలో పనిచేసే అవకాశాలు లభిస్తున్నాయి.

కానీ ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోతున్నాడు ఈ యంగ్ హీరో. గత 4 నెలల్లో 3 సినిమాలు విడుదల చేశాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేసిన ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ నవంబర్ లో రిలీజ్ అయ్యింది. జనవరిలో ‘యూవీ’ బ్యానర్లో చేసిన ‘కళ్యాణం కమనీయం’ సినిమా రిలీజ్ అయ్యింది. ఇక ఫిబ్రవరిలో అదీ ఈ మధ్యనే సంతోష్ శోభన్ నటించిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే చిత్రం కూడా రిలీజ్ అయ్యింది. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల తన ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించింది.

ఇది కూడా క్రేజీ ప్రాజెక్టే.. కానీ రెండు రోజులు కూడా థియేటర్లలో నిలబడలేకపోయింది. ఓటీటీ కోసం మొక్కుబడిగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసినట్టు చేశారు. అయినా సంతోష్ కు సక్సెస్ కొట్టే ఛాన్స్ ఉంది. అతను హీరోగా ‘వైజయంతి మూవీస్’ బ్యానర్లో చేసిన ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకురాలు. ఈ సినిమా కనుక హిట్ అయితే సంతోష్ ఇమేజ్ పెరుగుతుంది. అలాగే తర్వాత ‘యూవీ’ లో మరో సినిమా చేయబోతున్నాడు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus