ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో సినిమా వస్తుందంటే ఏమి ఆలోచించకుండా కుటుంబ సమేతంగా థియేటర్ కి వెళ్లిపోవచ్చు. అతను ఎంచుకున్న కథలు అంత బాగా ఉంటాయి. తాజాదనం నిండి ఉంటాయి. నిర్మాణానికి వంకపెట్టలేము. బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆర్య, శతమాతం భవతి.. ఇవన్నీ అతని బ్యానర్లో వచ్చినవే. అందుకే అతని సినిమాలకి ఓ బ్రాండ్ అంటూ ఏర్పడింది. అయితే నేటి కాలానికి తగ్గట్టు మారాలనో.. భారీ హిట్స్ అందుకోవాలని తపనో.. తెలియదు గానీ కమర్షియల్ కథలని ఎంచుకుంటున్నారు. అందులో భాగంగానే డీజే, నేనులోకల్ చిత్రాలు వచ్చాయి.
ఇప్పుడు తాజాగా హలో గురు ప్రేమకోసమే లాంటి రొటీన్ కమర్షియల్ చిత్రంతోనే మనముందుకు వచ్చారు. ఈ సినిమాలో అసలు కొత్తదనం లేకపోవడంతో.. దిల్ రాజుని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఎందుకు ఇలాంటి చిత్రాలను తీస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చిత్రాలు తీసి కమర్షియల్‌గా దిల్ రాజు విజయాలు అందుకున్నా.. అతని పేరు మాత్రం రోజు రోజుకి తగ్గిపోతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఆ విషయాన్ని గమనించకపోతే ఇతర కమర్షియల్ నిర్మాతలకి, దిల్ రాజుకి పెద్ద తేడా ఉండదని చెబుతున్నారు.