Jr NTR, Ram Charan: చరణ్, తారక్ లకు ప్రభాస్ మూవీ షాకిచ్చిందా?

రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి2 సాధించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. ఈ సినిమాతో స్టార్ హీరో ప్రభాస్ మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల ఫ్యాన్స్ కు సైతం ఈ సినిమా నచ్చింది. బాహుబలి2 సినిమా విషయంలో రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

ప్రభాస్ కు బాహుబలి2 తర్వాత పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కడంతో పాటు ప్రభాస్ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. బాహుబలి2 ట్రైలర్ కు 24 గంటల్లో ఏకంగా 21.81 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. బాహుబలి2 విడుదలై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ మరే ట్రైలర్ కు ఈ స్థాయిలో వ్యూస్ రాలేదు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావించినా ఈ ట్రైలర్ కు 24 గంటల్లో కేవలం 20.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఈ రికార్డు వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషిస్తూ సోషల్ మీడియాలో బాహుబలి2 హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత స్థానాలలో వకీల్ సాబ్, పుష్ప, సాహో, అఖండ ట్రైలర్లు ఉన్నాయి. ఏ టాలీవుడ్ హీరో సినిమా ట్రైలర్ ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన తర్వాత కొత్త రికార్డులను క్రియేట్ చేయడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus