బాహుబలి కంక్లూజన్ బడ్జెట్ తెలిస్తే షాక్ తింటారు

బాహుబలి సెట్స్ మీదకు వెళ్ళినప్పుడు ఒకే మూవీ అనుకున్నారు. కానీ ఆ కథను రెండున్నర గంటల్లో చెప్పలేమనుకొని రెండు పార్టులుగా తీసుకొస్తున్నారు. బాహుబలి మొదటి పార్ట్ విడుదలై రికార్డులు సృష్టించింది. సెకండ్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. అయితే బాహుబలి 1 కంటే రెండో పార్ట్ కి ఎక్కువగా బడ్జెట్ పెట్టినట్లు తెలిసింది. అభిమానుల అంచనాలకు మించేలా ఉండాలని కొన్ని సీన్లు రీ షూట్ చేశారని, గ్రాఫిక్స్ వర్క్స్ కోసం ఎక్కువగా వెచ్చించినట్లు సమాచారం. బిగినింగ్ కి వంద కోట్లు ఖర్చు కాగా, కంక్లూజన్ మూవీకి 250 కోట్లు ఖర్చు అయినట్లు చిత్ర బృందం తెలిపింది.

ఇంత బడ్జెట్ లో ఏ భారతీయ మూవీ తెరకెక్కలేదు. అయినా కంగారు పడనవసరం లేదు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ (థియేటర్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కలుపుకొని) 500 కోట్లు దాటిపోయింది. రిలీజ్ సమయానికి మరికొన్ని కోట్లు యాడ్ అవుతాయి. బాహుబలి బిగినింగ్ 600 కోట్లు మాత్రమే రాబట్టిందని, ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న బాహుబలి కంక్లూజన్ వెయ్యికోట్లు వసూలు చేస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus