NBK107 గురించి ఇంట్రెస్టింగ్‌ రూమర్స్‌

నందమూరి బాలకృష్ణ సినిమాలో కనీసం ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే. గత కొంతకాలంగా ఈ ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది. బాలయ్య డబుల్‌ రోల్‌ చేయడమో, లేదంటే ఇంకేదో కారణంగా ఇద్దరు నాయికల్ని తీసుకుంటూ ఉన్నారు. అయితే NBK107లో మరో గ్లామర్‌ను యాడ్‌ చేస్తున్నారంట. అంటే ఈ సినిమాలో ఇద్దరు నాయికలు కాదు, ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ NBK107 తెరకెక్కిస్తోంది.

ఇటీవల ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాలో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నటిస్తారని తెలిపారు. ఇక చెప్పాల్సింది హీరోయిన్‌ గురించే. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నారు అనేది తాజా మాట. అంటే ఈ సినిమాలోనూ బాలకృష్ణ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్‌ను తీసుకుంటున్నారని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి.

నిజానికి సినిమా ప్రకటించకముందే ఈ పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత త్రిష పేరు చర్చల్లోకి వచ్చింది. అదేంటి శ్రుతి ఉండదా అనుకుంటుంటే… ఇద్దరు నాయికలు అని సమాచారం వచ్చింది. అయితే ఇప్పుడు నయనతార గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో ఇందులో ఇద్దరు నాయికలు కాదు, ముగ్గురు నాయికలు అని తెలుస్తోంది. మరి అనుకున్న ఈ ముగ్గురే అవుతారా. లేక మారుతారా అనేది చూడాలి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus