Baladitya, Geetu: గీతు పై సీరియస్ అయిన బాలాదిత్య..! టాస్క్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో ఈసారి కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా మిషన్ ఇంపాజబుల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో హౌస్ మేట్స్ రెండు టీమ్స్ గా విడిపోయారు. రెడ్ టీమ్ కి కెప్టెన్ గా గీతు, బ్లూటీమ్ కి కెప్టెన్ గా ఆదిరెడ్డి ఉన్నారు. ఒకరి భుజంపై ఉన్న కలర్ స్ట్రిప్స్ ని ఇంకొకరు లాక్కునే ప్రయత్నం చేయాలి. అలాగే, బిగ్ బాస్ ఇచ్చే ఛాలెంజస్ ని ఎదుర్కోవాలి. ఇక్కడే బ్లూటీమ్ లో ఉన్న బాలాదిత్య సిగెరట్స్, లైటర్ దాచేసింది గీతు.

రెండు స్ట్రిప్స్ ఇస్తేనే సిగెరట్ ఇస్తానని తన వీక్ నెస్ పై దెబ్బకొట్టింది. అంతకుముందు కూడా బ్యాటరీ టాస్క్ లో ఇలాగే చేసింది. బ్యాటరీ టాస్క్ లో బిగ్ బాస్ చెప్పింది ఒకటైతే, బయటకి వచ్చి దాన్ని ఇంకోలా మార్చి చెప్పి, బాలాదిత్యతో సిగరెట్స్ శాక్రిఫైజ్ చేయించింది. ఈవిషయం బాలాదిత్యకి కన్ఫెషన్ రూమ్ లోకి తీస్కుని వెళ్లి చూపించినా కూడా గీతు పై పాజిటివ్ గా నే స్పందించాడు. కానీ, ఈసారి మాత్రం ఆటకోసం ఇంతలా దిగజారిపోతావా అంటూ ప్రశ్నించాడు. ఒకటికి రెండుసార్లు సిగరెట్స్ ఏవీ అని, లైటర్ ఏది అని చాలా మర్యాదగా అడిగాడు బాలాదిత్య.

కానీ, రెడ్ టీమ్ వాళ్లు ఎవరూ స్పందించలేదు. దీంతో మెల్లగా ఆర్గ్యూమెంట్ కి దిగాడు. గీతుని టార్గెట్ చేసి అడిగాడు. నాకు రెండు స్ట్రిప్స్ ఇస్తేనే సిగెరెట్ ఇస్తానని కండీషన్ పెట్టింది. దీంతో బాలాదిత్య ఫైర్ అయ్యాడు. ఆఫ్ ట్రాల్ సిగరెట్ కోసం ఎంతలా దిగజారిపోతున్నావో తెలుసా అంటూ రెచ్చిపోయి అరిచాడు. ఫస్ట్ గీతునే అఫ్ ట్రాల్ సిగరెట్ అంది. దీంతో ఆదిత్యకి ఒళ్లు మండింది. అందరూ దాన్ని నమ్మద్దు నమ్మద్దు అంటే, నేనే చెల్లి చెల్లి అని తిరిగాను. తప్పు నాదే అంటూ ఎమోషనల్ అయిపోయాడు. సిగెరట్ దాచేయడానికి నువ్వు బిగ్ బాస్ కాదు కదా, అంటూ ప్రశ్నిస్తూనే చాలా మాటలు అన్నాడు.

దీనికి గీతు ఒకవైపు బాధపడుతూనే చాలా కఠినంగా కూర్చుని ఉంది. చివరి వరకూ సిగరెట్స్ ని తన దగ్గరే భద్రంగా పెట్టుకుంది. ఇక ఈటాస్క్ లో ఈ సిగరెట్ ఇష్యూనే చాలా సీరియస్ అయ్యింది. నిజానికి లైటర్ ని గీతుకి ఇచ్చింది శ్రీహానే. కానీ, శ్రీహాన్ బాలాదిత్యని ఏడుస్తుంటే వచ్చి ఓదార్చాడు. అందుకే, బాలాదిత్య చాలాసార్లు శ్రీహాన్ ని అడిగాడు. ఇక ఇంకో విషయం ఏంటంటే, గీతు – శ్రీసత్య ఇద్దరూ వాసంతీకి పురగులు అంటే భయం అని,

అలాగే ఇనయకి సంబంధించిన వస్తువులని తీస్కుని వద్దామని డిస్కస్ చేస్కున్నారు. వీరిద్దరూ ఎదుటి వాళ్ల వీక్ నెస్ తో ఆడుకోవడమే గేమ్ అని ఫిక్స్ అయ్యారు. నిజానికి టాస్క్ పేపర్ లో మీ భుజబలంతో పాటుగా, బుద్ధిబలం మాత్రమే వాడమని రాశారు. కానీ, ఎదుటి వారి వీక్ నెస్ తో ఆడుకోమని రాయలేదు. మొత్తానికి ఈసారి కూడా వీకండ్ గీతుకి నాగార్జున చేతిలో గట్టిగా పడేలాగానే కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus