నేచురల్ స్టార్ నాని హీరోగా, నూతన దర్శకుడు శౌర్యువ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘హాయ్ నాన్న’. డిసెంబర్ 7 న ఈ సినిమా విడుదల కాబోతుంది. విడుదలకి చాలా తక్కువ రోజులే ఉండటంతో సినిమాని ఎంతో క్యూరియస్ గా ప్రమోట్ చేస్తున్నాడు నాని. ఈ క్రమంలో ట్విట్టర్లో ‘#asknani ‘ అనే హ్యాష్ ట్యాగ్ తో అభిమానులతో ముచ్చటించాడు నాని. అభిమానులు ఈ ట్యాగ్ ను ఉపయోగించి ఆసక్తికర ప్రశ్నలు అడిగారు.
ఇందులో ఓ నెటిజన్.. ‘మీకు నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఆసక్తి ఉంది?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి నాని ‘బలగం’ సినిమా దర్శకుడు వేణుతో సినిమా చేయాలని ఉంది అన్నట్టు సమాధానం ఇచ్చాడు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ నిర్మాణంలో రూపొందిన ‘బలగం’ చిత్రం చాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పెట్టిన రూపాయికి పది రూపాయల లాభాలను అందించింది ఈ సినిమా.
అంతేకాకుండా 100 కి పైగా ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ కూడా లభించాయి. ‘చావు కాన్సెప్ట్’ తో రూపొందిన ఈ సినిమా చాలా నెగిటివ్ సెంటిమెంట్ తో కూడినది అని చెప్పాలి. అయినా దర్శకుడు వేణు చాలా ఎంగేజింగ్ గా మూవీని తెరకెక్కించాడు. తెలంగాణ సంస్కృతిని చాలా చక్కగా చూపించాడు. బహుశా హీరో నానిని అదే ఆకర్షించి ఉంటుంది.
అందుకే వేణుతో (Venu) సినిమా చేయాలని నాని ఆశపడుతున్నట్లు స్పష్టమవుతుంది. కానీ నానితో చాలా మంది క్రేజీ డైరెక్టర్లు సినిమాలు సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. ఆల్రెడీ వివేక్ ఆత్రేయ… నానితో ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇంకా రేసులో చాలా మంది ఉన్నారు. మరి వేణుతో సినిమా చేయడానికి నానికి కుదురుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న