Balagam: బలగం బలం చూపించిందిగా! ఇదెక్కడి అరాచకం బాబోయ్!

ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపిన తెలుగు సినిమాలను చేతివేళ్ళతో లెక్కపెట్టొచ్చు. బ్లాక్ బస్టర్ సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్ లో విడుదలైన సినిమాలలో ఎక్కువ శాతం డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచినవే ఉన్నాయి. గడ్డు కాలం ఎదురుకుంటున్న సమయం లో బయ్యర్స్ కి జాక్పాట్ లాగ తగిలిన చిత్రం ‘బలగం’. ప్రియదర్శి మరియు కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా , బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.

సినిమాల్లో కమెడియన్ రోల్స్ చేస్తూ, జబర్దస్త్ షో ద్వారా ఆడియన్స్ కి మరింత చేరువ అయ్యాడు వేణు టిల్లు. ఈ చిత్రం తో ఆయన మొట్టమొదటిసారి డైరెక్టర్ కూడా మారాడు. ఆయనలో ఇంత దర్శకత్వ ప్రతిభ ఉందా అని ప్రేక్షకులతో పాటుగా సినీ సెలెబ్రిటీలు కూడా నోరెళ్లబెట్టారు.ఈ చిత్రాన్ని ప్రముఖ కమర్షియల్ నిర్మాత దిల్ రాజు నిర్మించడం విశేషం.

కేవలం 70 లక్షల రూపాయిల తో (Balagam) ఈ సినిమాని నిర్మించగా ఫుల్ రన్ లో 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.ఇక గ్రాస్ పరంగా చూస్తే ఏకంగా 28 కోట్ల రూపాయిలు వచ్చాయట. ఓటీటీ స్ట్రీమింగ్ ఓ కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గానే ఈ చిత్రాన్ని టీవీ లో కూడా టెలికాస్ట్ చేసారు.

ఈ మొదటి టెలికాస్ట్ లో ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూరల్ + అర్బన్ ప్రాంతాలకి కలిపి 14.2 టీఆర్ఫీ ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో రేటింగ్స్ దాదాపుగా 22 వరకు వచ్చిందట. ఇది ఆల్ టైం రికార్డు అని చెప్తున్నారు. గత ఏడాది టెలికాస్ట్ అయిన ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి హైదరాబాద్ సిటీ లో 18 రేటింగ్స్ మాత్రమే వచ్చాయట. కానీ బలగం చిత్రానికి అంతకు మించి రావడం ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చకి దారి తీరింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus