Balayya Babu: కల్ట్ క్లాసిక్ సీక్వెల్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య!

నందమూరి బాలకృష్ణ కూడా గతంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. కానీ అందులో సక్సెస్ అయినవి చాలా తక్కువ. అయితే ఆ సక్సెస్ అయిన వాటి సినిమాల లిస్ట్ లో ‘ఆదిత్య 369’ కూడా ఉంటుంది. టెక్నాలజీ అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే ఈ మూవీని ఓ విజువల్ వండర్ గా రూపొందించారు సింగీతం శ్రీనివాస్. కమర్షియల్ గా కూడా ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి ఈ మూవీ ఓ క్లాసిక్ గా నిలిచింది.

అలాంటి ఈ మూవీకి సీక్వెల్ రూపొందనుంది అంటూ చాలా కాలంగా కథనాలు వినిపిస్తున్నాయి. వాటి పై ఇటీవల బాలయ్య కూడా క్లారిటీ ఇచ్చాడు. ‘ఆదిత్య 999 మ్యాక్స్’ పేరుతో ఈ సీక్వెల్ రూపొందనున్నట్లు బాలయ్య చెప్పుకొచ్చాడు. తాజాగా ‘దాస్ క ధమ్కీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బాలయ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ” సినిమా అంటే పిచ్చి ఉండకూడదు ప్యాషన్ ఉండాలి… అని నేను గతంలో చెప్పాను.

అప్పుడు నన్ను చాలా మంది ట్రోల్ చేశారు. సినిమా అంటే బలంగా ఫీలయితే అది ప్యాషన్. సినిమా అంటే బలహీనతగా ఫీలయితే అది పిచ్చి.ప్యాషన్ అంటే ఏంటో విశ్వక్ సేన్ డైరెక్ట్ చేసిన ఈ ‘దాస్ క ధమ్కీ’ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ఈ సినిమాని అద్భుతంగా డైరెక్ట్ చేశాడు అని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. నేను కూడా డైరెక్టర్ గా ఓ సినిమాని మొదలుపెట్టాను. కానీ దాన్ని పూర్తిచేయలేకపోయాను.

అదే ‘నర్తనశాల’. అప్పటి నుండి నేను డైరెక్షన్ జోలికి పోలేదు” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున ‘ఆదిత్య 369’ అంటూ అరుస్తుంటే.. ‘ఉంది ఉంది ‘ఆదిత్య 999 మ్యాక్స్. వచ్చే ఏడాది నా డైరెక్షన్లో ప్రారంభం కానుంది. ‘ అంటూ తెలిపారు బాలయ్య. ఇక ఈ చిత్రం 2023 ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus