టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య సినీ కెరీర్ కు మేలు జరిగేలా ఈ మధ్య కాలంలో వరుస విజయాలు దక్కుతున్నాయి. బాలయ్య కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటుండగా బాలయ్య సక్సెస్ రేట్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. అయితే తన ఫ్లాప్ సినిమాల గురించి బాలయ్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ముహూర్త బలం లేకే ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయని బాలయ్య చెప్పుకొచ్చారు.
మీరు నటించిన సినిమాలలో ఏ సినిమా ఇష్టమనే ప్రశ్నకు బాలయ్య స్పందిస్తూ తను అన్ని సినిమాలకు ఒకే విధంగా కష్టపడతానని తెలిపారు. కొన్ని సినిమాలు బాగా ఆడతాయని అనుకున్నానని కానీ ఆ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయని మరికొన్ని సినిమాలు బాగా ఆడవని అనుకున్నానని కానీ ఆ సినిమాలే ఆడాయని బాలయ్య అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
ఆ సినిమాలకు పెట్టిన మూహూర్తాలు బాలేకపోయి ఉండవచ్చని అందుకే ఆ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయని బాలయ్య పరోక్షంగా చెప్పుకొచ్చారు. భగవంత్ కేసరి సినిమాకు ఇప్పటివరకు 45 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. మరో 15 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధిస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పవచ్చు. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
వరుస సక్సెస్ లతో బాలయ్య (Balakrishna) రెమ్యునరేషన్ 25 కోట్ల రూపాయలకు చేరిందని సమాచారం అందుతోంది. బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత ఇస్తారేమో చూడాలి. బాలయ్య మల్టీస్టారర్ సినిమాలలో నటించాలని అభిమానులు ఫీలవుతున్నారు.