Balakrishna,Jr NTR: జూనియర్ ప్లెక్సీ లను తొలగించమని ఆదేశించిన బాలకృష్ణ!

దివంగత స్టార్ హీరో, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. ఇది 28వ వర్ధంతి. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు బాలయ్య వెళ్లారు. అనంతరం బయటకు వచ్చిన బాలయ్య.. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉండటం చూసి కోపంతో రగిలిపోయారు. ఈ క్రమంలో వెంటనే తన అనుచరులతో ‘జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు తీసేయాలని’ ఆదేశించారు.

ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బాలయ్య అనుచరులు తీసి బయట పెడుతున్న దృశ్యాలను కూడా ఈ వీడియోలో చూడొచ్చు. బాలయ్య కంటే ముందుగానే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..లు ఎన్టీఆర్ ఘాట్ వద్దకి నివాళులు అర్పించడానికి వెళ్లారు. ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. వాళ్ళు వచ్చి వెళ్ళాక బాలయ్య రావడం జరిగింది.

ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ – బాలయ్య..ల మధ్య కొత్త గ్యాప్ ఏర్పడింది అనే టాక్ చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు నందమూరి తారకరామారావు గారి 28 వ వర్ధంతి నాడు మరోసారి అది బయట పడినట్టు అయ్యింది. 2009 ఎలక్షన్స్ టైంలో ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబం దగ్గరకు తీసుకుంది.ఆ టైంలో ఎన్టీఆర్ – బాలయ్య.. చాలా క్లోజ్ గా తిరిగారు. కానీ 2013 లో పొలిటికల్ గొడవల వల్ల మళ్ళీ విడిపోయారు.

అప్పటి నుండి ఆ గొడవలు సద్దుమణిగింది లేదు అని స్పష్టమవుతుంది. హరికృష్ణ మరణం టైంలో కలిసినట్టే కనిపించినా.. మళ్ళీ ఎందుకో సెపరేట్ అయ్యారు. ఎన్టీఆర్ వద్ద బాలయ్య (Balakrishna) టాపిక్ వచ్చినా, బాలయ్య వద్ద ఎన్టీఆర్ టాపిక్ వచ్చినా.. వీళ్ళు ఏదో ఒక రకంగా మాట దాటేస్తూనే వస్తున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus