NBK108: 40 ఏళ్ల క్రితం ఇదే రోజు బాలయ్య జీవితంలో ఓ అద్భుతం జరిగింది తెలుసా!

నటసింహ నందమూరి బాలకృష్ణ – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కనున్న సినిమా డిసెంబర్‌ 8న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.. బాలయ్య 108వ చిత్రమిది.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ క్లాప్, దిల్ రాజు కెమెరా స్విచ్ఛాన్, రాఘవేంద్ర రావు ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.. నిర్మాతలు శిరీష్, నవీన్ ఎర్నేని (మైత్రీ మూవీస్) స్క్రిప్ట్ అందజేశారు..

అనిల్ రావిపూడి ఈ మూవీలో నటసింహాన్ని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. అవతార్‌లో చూపించబోతున్నాడని టాక్.. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగానే కాకుండా.. ఆయనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే కొత్త కథ, కథనాలతో సినిమా ఉండబోతుందని అంటున్నారు. ‘అఖండ’ తో అరాచకం సృష్టించి.. ‘వీర సింహా రెడ్డి’ తో విజృంభించబోతున్న యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు..

ఇదిలా ఉంటే మూడేళ్ల క్రితం ‘అఖండ’ మూవీకి డిసెంబర్ 6న (2019) పూజ చేశారు.. NBK 108 ప్రారంభోత్సవానికి డిసెంబర్ 8వ తేదీని ఫిక్స్ చేయడానికీ, నటసింహా పర్సనల్ లైఫ్‌కీ భలే లింక్ కుదిరింది.. సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజు బాలయ్య జీవితంలో ఓ అద్భుతం జరిగింది.. అదేంటంటే.. బాలయ్య పెళ్లి.. 1982 డిసెంబర్ 8న వసుంధర దేవితో ఆయన వివాహం జరిగింది.. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. వెడ్డింగ్ పిక్స్, శుభలేఖ వంటివి నెట్టింట వైరల్ చేస్తున్నారు నందమూరి అభిమానులు..

ఇక ఏజ్డ్ క్యారెక్టర్లో కనిపించబోయే బాలయ్యకి ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీల కూతురిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. మరో కీలకపాత్ర కోసం ‘టాక్సీవాలా’ బ్యూటీ ప్రియాంక జవాల్కర్‌ని తీసుకున్నారని సమాచారం.. హైదరాబాద్ బాచుపల్లిలో 12 రోజుల పాటు భారీ జైలు సెట్‌లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న ‘వీర సింహా రెడ్డి’ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని అంటున్నారు. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న బాక్సాఫీస్ బరిలో నటసింహ గర్జించడానికి రాబోతున్నాడు.. ఈ సినిమా విజయంపై ధీమాగా ఉన్నాడు బాలయ్య..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus