Balakrishna: సిద్ధూ-బాలయ్య..ల బాండ్ అలాంటిది మరి.. వీడియో వైరల్!

నందమూరి బాలకృష్ణ (Balakrishna) కోపిష్టి అని అంతా అంటుంటారు. కానీ ఆయన కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆయన ప్రేమ వర్షంలా కురుస్తుంది అని.. ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. పలు సందర్భాల్లో అభిమానులపై బాలయ్య చెయ్యి చేసుకున్న వీడియోలు మాత్రమే ఎక్కువగా వైరల్ అయ్యాయి. కానీ అభిమానుల ఇంటికి వెళ్లి మరీ బాలయ్య భోజనం చేసిన వీడియోలు కానీ, అభిమానుల కుటుంబాలను ఆప్యాయంగా దగ్గర తీసుకున్న వీడియోలు కానీ ఎక్కువగా వైరల్ అయ్యింది.

Balakrishna

బాలయ్య కోపం, ప్రేమ..వంటి వాటికి స్టార్స్ అతీతం కాదు. అది చాలా మందికి తెలిసిందే. అన్నీ ఎలా ఉన్నా.. ఇప్పటి యంగ్ హీరోలు అయిన విశ్వక్ సేన్, అడివి శేష్, సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) వంటి వారితో బాలయ్య (Balakrishna) చాలా క్లోజ్ గా ఉంటారు. ఇప్పుడు సిద్ధూ జొన్నలగడ్డ, బాలయ్య..ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎక్కడో ఎయిర్పోర్ట్..లో వీళ్ళు కలిసినట్టు ఉన్నారు. అనుకోకుండా కలిసిన బాలయ్యని ఆప్యాయంగా పలకరించిన సిద్ధూ.. తర్వాత బాలయ్య కాళ్ళపై కూడా పడ్డాడు. దీంతో బాలయ్య అతన్ని దగ్గరకి తీసుకుని ముద్దు పెట్టాడు.

ఈ వీడియో చూసి వీళ్ళ బాండింగ్ ఎంత గొప్పదో అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. పలు సందర్భాల్లో బాలయ్య.. విశ్వక్ సేన్, అడివి శేష్, సిద్ధూ జొన్నలగడ్డ.. నా గ్యాంగ్ అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తన కొడుకు మోక్షజ్ఞకి కూడా … ‘నువ్వు వాళ్లనే ఆదర్శంగా తీసుకోవాలి… నన్ను కాదు’ అని కూడా అంటూ చెప్పినట్టు బాలయ్య ఓ సందర్భంలో తెలిపారు. ఈ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

దేవర సెన్సార్ కట్స్ విషయంలో క్లారిటీ ఇదే.. ఆ మార్పులు చేశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus