Devara: దేవర సెన్సార్ కట్స్ విషయంలో క్లారిటీ ఇదే.. ఆ మార్పులు చేశారా?

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ దేవర  (Devara) సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం పక్కా అని తేలిపోయింది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మొదట ఈ సినిమా నిడివి 2 గంటల 55 నిమిషాలు అని వార్తలు వినిపించినా తెలుస్తున్న సమాచారం ప్రకారం 2 గంటల 58 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. దేవర మూవీ సెన్సార్ కట్స్ కు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.

Devara

ఒక వ్యక్తి తన భార్య కడుపుపై తన్నడం, కుంజర అనే వ్యక్తి కొడుకు తల్లిని కొట్టడం, సొరచేప విజువల్ లో సీజీఐ మార్క్ లేకపోవడం, కత్తికి ఒక శవాన్ని వేలాడదీసే షాట్ కు సంబంధించి అభ్యంతరం చెప్పారు. మొత్తం 4 షాట్స్ కు అభ్యంతరం చెప్పారని 7 సెకన్లకు సంబంధించి కట్స్ చెప్పగా 2 సెకన్ల షాట్స్ ను రీప్లేస్ చేశారని భోగట్టా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలిని తీర్చేలా దేవర ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.

దేవర ట్రైలర్ కు మిక్స్డ్ టాక్ రావడం ఒక విధంగా మంచిదే అని ఫ్యాన్స్ చెబుతున్నారు. హైప్ మరీ పెరగడం పెద్ద సినిమాలకు మంచిది కాదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. దేవర సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే చర్చ జరుగుతోంది. దేవర సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా ఉండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

దేవర సినిమాలో మరో హీరోయిన్ గా శృతి మరాఠే నటిస్తున్నారు. ట్రైలర్ లో శృతి మరాఠేకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. దేవర సినిమా నుంచి రాబోయే రోజుల్లో విడుదల కానున్న రిలీజ్ ట్రైలర్ ఏ రేంజ్ లో ఉండనుందో చూడాల్సి ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవుతున్న తారక్ ఆ సినిమాలతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

 నాగ మణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus