ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో రాష్ట్రంలో కొత్త జీవోను అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం ఆ జీవోకు సవరణలు చేసినా నష్టాలు వస్తాయన్న భయంతో థియేటర్లను తెరవడానికి థియేటర్ల ఓనర్లు ఆసక్తి చూపడం లేదు. పొలిటికల్ రీజన్స్ వల్లే ఏపీ ప్రభుత్వం కొన్ని సినిమాలను టార్గెట్ చేస్తుందనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఏపీ టికెట్ రేట్ల గురించి మాట్లాడిన బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ప్రభుత్వం కన్ఫ్యూజన్ లో ఉందని ఏపీ టికెట్ రేటు విషయంలో తన వంతు ప్రయత్నం చేస్తానని బాలకృష్ణ అన్నారు. 20 రూపాయలు, 30 రూపాయలు టికెట్ ధరలుగా నిర్ణయిస్తే ఎగ్జిబిషన్ రంగం ఉండదని బాలయ్య కామెంట్లు చేశారు. ప్రభుత్వాలు సాయపడితే మాత్రమే ఇండస్ట్రీ బాగుంటుందని బాలయ్య వ్యాఖ్యలు చేశారు. నిర్మాతల మండలి చిన్న నిర్మాతలకు ప్రయోజనం చేకూరేలా పాలసీలను మార్చాలని బాలకృష్ణ సూచనలు చేశారు. తలా తోకా లేని బీ ఫారమ్ లా ఏపీలో జీవో ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు.
తక్కువ టికెట్ రేట్లతో నిర్మాతలు ఇండస్ట్రీలో నిలబడలేరని బాలయ్య అన్నారు. ఏపీ ప్రభుత్వం షరతులు ఎవరికీ అర్థం కావడం లేదని బాలయ్య పంచ్ వేశారు. ప్రభుత్వాలు సహకరించకపోతే సినిమా ఇండస్ట్రీ మనుగడ సాధించడం కష్టమని బాలకృష్ణ పేర్కొన్నారు. మా బిల్డింగ్ కోసం అన్ని విధాలా సహకారం అందిస్తానని బాలయ్య తెలిపారు.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!