NBK107: ‘అఖండ’ తరహాలోనే NBK107లో పొలిటికల్‌ సెటైర్లు!

బాలకృష్ణ సినిమా అంటే అందులో కచ్చితంగా పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌ ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి. అందులో పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ పెట్టడమో, లేకపోతే బాలయ్యతో అలాంటి డైలాగ్‌లు చెప్పించడమో కచ్చితంగా జరుగుతూ ఉంటుంది. బోయపాటి శ్రీను తీసే సినిమాలు అయితే తెలియకుండానే పాలిటిక్స్‌ సినిమాలో మిక్స్‌ అయిపోతాయి. అందుకే పొలిటికల్‌ ప్రత్యర్థులకు బాలయ్య కౌంటర్‌ వేస్తున్నట్లు డైలాగ్స్‌ రాస్తుంటారు. మొన్నీమధ్య ‘అఖండ’లో విన్నాం. ఇప్పుడు మళ్లీ బాలయ్య 107లో చూస్తాం.

అంత పక్కాగా ఎలా చెప్పేస్తారు అనుకుంటున్నారు. నిన్న వచ్చిన బర్త్‌డే టీజర్‌ చూస్తే ఎవరికైనా ఈ విషయం తెలిసిపోతుంది. బాలయ్య పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌కి తగ్గట్టుగా దర్శకరచయిత గోపీచంద్‌ మలినేని ఈ సినిమాలో డైలాగ్‌లు రాశారు అని చెప్పేయొచ్చు. జీవో గురించి చెప్పిన డైలాగ్‌ కానీ, ఈ టీజర్‌లో బాలయ్య వాడిన బూతు కానీ.. నేటి ఏపీ పాలిటిక్స్‌లో వైరల్‌ అయిన పదాలే. కావాలంటే మీరే ఓసారి రీథింక్‌ చేయండి. మీకే అర్థమవుతుంది.

టీజర్‌లో బాలకృష్ణ చెప్పిన తొలి డైలాగ్‌ జీవోల గురించి. ‘నీ జీవో గవర్నమెంట్‌ ఆర్డర్‌.. నా జీవో గాడ్స్‌ ఆర్డర్‌’ అని చెప్పాడు బాలయ్య. ఏపీలో చాలా రోజుల నుండి జీవోల గురించి చర్చ నడుస్తూనే ఉంది. జీవోలు ఇవ్వడం, వెనక్కి తీసుకోవడం ఒకవైపు జరుగుతుంటే.. మరోవైపు జీవోలు ఇవ్వడం కోర్టులు కొట్టేయడం జరుగుతుంది. ఆ హీట్‌ ఎలిమెంట్‌ని సినిమాలో వాడుకున్నారు. ఇక రెండోది ‘బో… డీకే’ అనే మాట. ఇది కూడా ఆ మధ్య పాపులర్‌ మాట.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి ఓ టీడీపీ నాయకుడు ఈ మాట మీడియా ముందు అనడం పెద్ద దుమారమే రేపింది. అసలు దీని అర్థం తెలియకుండా ఇన్నాళ్లూ వాడేసిన తెలుగువాళ్లు… ‘ఓ హో ఇదా అర్థం. ఇంతుందా ఆ మాటలో’ అని అనుకున్నారు. నిజానికి ఎవరూ ఎవరినీ తిట్టకూడదని బూతు ఇది. కానీ ఆ నాయకుడు వాడాడు. ఇప్పుడు బాలయ్య కూడా సినిమాలో వాడేశాడు. మరి ఈ మాట ఎవరు రాశారు, ఎందుకు రాశారో తెలియదు కానీ బాలయ్య నోట పొలిటికల్‌ మాట గట్టిగానే వినిపించింది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus