Balakrishna: బాలయ్యను మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఎందుకంటే?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మనస్సు మంచిదని చాలామంది అభిమానులు చెబుతారు. బాలయ్యకు కోపం ఎక్కువే అని కొంతమంది కామెంట్లు చేసినా ఆయన సన్నిహితులు మాత్రం బాలయ్యకు సేవా గుణం, దయా గుణం ఎక్కువని కామెంట్లు చేస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తన దృష్టికి వస్తే సహాయం చేసే విషయంలో బాలకృష్ణ వెనుకడుగు వేయరు. బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ షో ప్రసారమవుతోంది. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ లో బాలకృష్ణ బేగం అనే చిన్నారికి బ్రెయిన్ క్యాన్సర్ చికిత్స కొరకు సహాయం చేస్తానని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

ఆ చిన్నారికి బసవతారకం ఆస్పత్రిలో ఉచితంగా వైద్య చికిత్స అందేలా చూస్తానని మాట ఇచ్చిన బాలకృష్ణ ఆ మాటను నిలబెట్టుకున్నారు. బసవతారకం ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాలయ్య ఎంతోమంది పేద క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్య చికిత్స అందేలా చూస్తున్నారు. బేగం విషయంలో బాలకృష్ణ మాట నిలబెట్టుకోవడంతో నెటిజన్లు బాలయ్యను ప్రశంసిస్తున్నారు. అయితే కొందరు అభిమానులు మాత్రం బేగంకు భవిష్యత్తులో కూడా బాలకృష్ణ ఆర్థికంగా అండగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.

నెటిజన్ల కామెంట్లను బాలయ్య పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు అఖండ మూవీ నుంచి తాజాగా టైటిల్ సాంగ్ విడుదల కాగా ఆ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అఖండ ఎప్పుడు రిలీజైనా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. డిసెంబర్ నెలలో అఖండ రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus