Balayya Babu: బాలయ్య సినిమాకి అన్యాయం జరిగిందా..?

నందమూరి బాలకృష్ణ నటించిన కొత్త సినిమా ‘వీర సింహారెడ్డి’ ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలిరోజు ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లో అదే సినిమాను ఆడించారు. అమెరికాలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజయింది. ఆ ఒక్కరోజు వసూళ్ల మోత మోగించింది. బాలకృష్ణ చివరి సినిమా ‘అఖండ’ కంటే ‘వీరసింహారెడ్డి’ తొలిరోజు ఎక్కువ వసూళ్లు రాబట్టింది.

ఈ విషయంలో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే ఓవరాల్ కలెక్షన్స్ లో కూడా బాలయ్య సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ రెండో రోజు నుంచి ‘వీర సింహారెడ్డి’ జోరు కాస్త తగ్గింది. ‘వాల్తేర్ వీరయ్య’ కోసం ‘వీరసింహారెడ్డి’ సినిమా ఆడుతున్న కొన్ని థియేటర్ల నుంచి సినిమాను తీసేశారు. ఆ తరువాతి రోజు ‘వారసుడు’ కోసం దిల్ రాజు మరిన్ని థియేటర్లు తీసేసుకున్నారు.

కొన్ని ‘కళ్యాణం కమనీయం’ సినిమాకి వెళ్లిపోయాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. వరల్డ్ వైడ్ గా కూడా రెండో రోజు ‘వీరసింహారెడ్డి’ వసూళ్లలో భారీ కోత పడింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అంచనాలు తలకిందులైపోయాయి. మంచి స్క్రీన్స్ ఉన్న చోట సినిమా బాగానే ఆడుతుంది కానీ.. మిగిలిన చోట్ల మాత్రం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. మరోపక్క ‘వాల్తేర్ వీరయ్య’ వసూళ్లు నిలకడగా ఉన్నాయి.

పండగ ఎడ్వాంటేజీని ‘వాల్తేర్ వీరయ్య’ బాగా ఉపయోగించుకుంటుంది. టాక్ పరంగా రెండు సినిమాలకు పెద్దగా తేడా లేకపోయినా.. చిరంజీవి సినిమానే పైచేయి సాధిస్తుండడం బాలయ్య అభిమానులకు నచ్చడం లేదు. రెండు సినిమాలను నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్ వారే అయినప్పటికీ.. థియేటర్ల కేటాయింపు విషయంలో బాలయ్య సినిమాకి అన్యాయం చేస్తుందని.. ఎక్కువ థియేటర్లు ఇవ్వలేదని.. ఇలా పక్షపాతం చూపించడం ఏంటంటూ మైత్రి నిర్మాతలపై మండిపడుతున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus