నందమూరి బాలకృష్ణ – బి.గోపాల్.. ది… సూపర్ హిట్ కాంబినేషన్. ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘లారీ డ్రైవర్’ , ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ వంటి చిత్రాలతో బాలకృష్ణ ఇమేజ్ ను డబుల్ చేసింది బి.గోపాల్. ఇంకో రకంగా ‘పలనాటి బ్రహ్మనాయుడు’ అనే పెద్ద ప్లాప్ సినిమా తీసి బాలయ్య పై ట్రోలింగ్ కు శ్రీకారం చుట్టింది కూడా ఈయనే అని చెప్పాలి. ‘పలనాటి బ్రహ్మనాయుడు’ తర్వాత బి.గోపాల్ 4 సినిమాలు తీశారు. అవే.. ‘అడవి రాముడు'(2004 ), ‘నరసింహుడు’ , ‘మస్కా’ , ‘ఆరడుగుల బుల్లెట్’.
ఇందులో ‘మస్కా’ మినహాయిస్తే మిగిలిన సినిమాలు అన్నీ పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. ఇక ఆ సినిమాల కథలు కూడా ఓ 20 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలను జ్ఞాపకం చేశాయి. సో బి.గోపాల్ అన్ని రకాలుగా ఫేడౌట్ అయిపోయినట్టే అన్ని కొందరు అనే మాట. కాకపోతే ఆయనకు ఓ హిట్ సినిమా తీసి రిటైర్ అవ్వాలనే బలమైన కోరిక ఉంది. ఈ టైంలో ఆయనతో సినిమాలు చేయడానికి హీరోలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
ఇలాంటి టైంలో బాలయ్య.. బి.గోపాల్ కి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య భీభత్సమైన ఫామ్లో ఉన్నారు. ‘అఖండ’ ‘అన్ స్టాపబుల్'(టాక్ షో) ‘వీరసింహారెడ్డి’ వాటి చిత్రాలతో భీభత్సమైన ఫామ్లో ఉన్నారు బాలయ్య. ఆయన పారితోషికం కూడా పెరిగింది. ఇలాంటి టైంలో బి.గోపాల్ తో సినిమా అంటే రిస్క్ అనే చెప్పాలి. అయినప్పటికీ గతంలో తనకు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ కావడంతో.. బాలయ్య సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు ఇన్సైడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.
బాలయ్యకి (Balakrishna) వీరాభిమాని అయిన స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించే అవకాశాలు ఉన్నాయి.అలాగే బాలయ్య సన్నిహితుడు సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అవుతున్నట్టు కూడా వినికిడి. అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి కథాంశంతో రూపొందుతుందో చూడాలి..!
ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?